English   

మహేష్ 26 ముహూర్తం ఫిక్స్

mb
2019-05-09 21:14:53

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన `మహర్షి` రిలీజై  సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ మార్క్ వసూళ్లను దక్కించుకుని మిలియన్ డాలర్ క్లబ్ వైపు పరుగులు పెడుతోంది.ఇదే ఊపూలో మహేష్ తర్వాతి సినిమాపై దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అనీల్ రావిపూడి - అనీల్ సుంకర బృందం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టారు. అయితే జూన్ 15న ఈ సినిమాని ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ కూడా అదే రోజు నుంచి మొదలు పెడతారని సమాచారం. ఇప్పటికే విజయశాంతి మహేష్ కు అత్త పాత్రలో నటిస్తున్నారని, అమ్మ పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నరని, నటుడు  నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడనీ ప్రచారం జరుగుతోంది. అలాగే రష్మిక మందనను ఓ హీరోయిన్ గా ఫైనల్ చేశారని కూడా వార్తలొచ్చాయి. వీటిలో నిజమెంతో తెలియాలి అంటే మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే.

More Related Stories