English   

ప్రధాన పాత్రలో సంగీత దర్శకుడు కోటి.. నవంబర్ 26 న విడుదల కానున్న ‘1997’ సినిమా..

1997 movie
2021-11-08 12:52:09

సంగీత దర్శకుడు కోటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు అందించే బాణీల్లో ఏదో ఒక మాయ ఉంటుంది. అలా అతడి పాటలు శ్రోతలను కట్టి పడేస్తాయి. అయితే కోటి సంగీత దర్శకుడిగానే కాకుండా ఈ సారి సినిమాల్లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అతడితో పాటు మరో ముగ్గురు కూడా ఈ సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్ గా నటిస్తున్నారు. 

ఆ సినిమానే ‘'1997'’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ పోస్టర్ ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. నవంబర్ 26వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుందని పేర్కొన్నారు. అయితే ఈ సినిమాను నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా రూపొందించారు దర్శకుడు డాక్టర్ మోహన్. అతడు దీనికి దర్శకుడితో పాటు స్క్రీన్ ప్లే, కథను కూడా అందించాడు. 

ఇప్పటికే ఈ సినిమాకు  సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా అది ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. దానిలో మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ లుక్స్ అదుర్స్ అనే చెప్పాలి. అంతే కాకుండా ఈ సినిమాలో మంగ్లీ ఓ అద్బుతమైన పాటను పాడారు. దానిని కూడా అంతక ముందే విడుదల చేశారు. ‘‘ఏమి బతుకు.. ఏమి బతుకు’ అంటూ సాగే ఈ పాటను ప్రతీ ఒక్కరూ ఆనందించారు. 

మంగ్లీ పాడిన ఈ సాంగ్ బాగా ఉందని మంచి ఫీడ్ బ్యాక్ కూడా వచ్చింది. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులుగా దీనిలో డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటితో పాటు బెనర్జీ, రవి ప్రకాష్, రామరాజు తదితరులు ఉన్నారు. ఈ చిత్రం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు చిత్ర యూనిట్ సభ్యులు.

More Related Stories