English   

డిసెంబర్ 26న గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇస్తున్న సునీత రామ్ వీరపనేని

Singer Sunitha
2020-12-24 18:16:21

టాలీవుడ్ ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది. కొన్ని రోజుల కింద మీడియా పర్సన్ రామ్ వీరపనేనితో నిశ్చితార్థం చేసుకుంది ఈమె. ఈ సందర్భంగా డిసెంబర్ 26న గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీని ఇవ్వబోతున్నారు. ఈ పార్టీకి సంబంధించిన ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయి విడాకులు తీసుకున్న సునీత పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని గాన కోయిల ఆమె.  సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమెకు ఉంది.

More Related Stories