English   

బాలయ్య ‘రౌడీ ఇన్స్ పెక్టర్’ కు 26యేళ్లు 

Rowdy-Inspector

నందమూరి బాలకృష్ణ రోరింగ్ హిట్స్ లో ఒకటైన రౌడీ ఇన్స్ పెక్టర్ విడుదలై నేటికీ 26యేళ్లు. 1992 మే7న విడుదలైందీ సినిమా.  బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన రౌడీ ఇన్స్ పెక్టర్ లో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. విజయశాంతి ఆటోరాణిగా హీరోకు సమానమైన పాత్రతో ఆకట్టుకుంటుంది. విజయలక్ష్మి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ పై టి. త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద విజయం సాధించింది. నిజానికి ఈ సినిమా చేయడానికి ముందు బాలకృష్ణతో చంటి తీయాలనుకున్నారట. కానీ అప్పటికే ఆ సినిమా రైట్స్ కెఎస్ రామారావు తీసుకుని వెంకటేష్ హీరోగా తీయబోతున్నారని తెలిసి డ్రాప్ అయ్యారు. తర్వాత మరో రెండు మూడు కథలు అనుకున్నా అవి ఫైనల్ కాలేదు. చివరగా ఆంజనేయ పుష్పానంద్ అనే రచయిత రౌడీ ఇన్స్ పెక్టర్ కథ, స్క్రీన్ ప్లేతో సహా రాసుకుని బి గోపాల్ కు చూపించడం. దీన్ని పరుచూరి బ్రదర్స్ చూసి.. బాలయ్య తో తీస్తే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని చెప్పారు. అలా చాలా కాలంగా బాలయ్య, బి గోపాల్ కలిసి తీయాలనుకున్న ఈ కథ ఫైనల్ అయింది. తర్వాత పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. తర్వాత కథలోనూ చాలా మార్పులు చేశారు.

ఈ సినిమాపై అప్పటికే వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయిన పోలీస్ మూవీస్ అంకువం, కర్తవ్యంల ప్రభావం ఉంది. అయితే ఇది ఆ రెండు సినిమాలకూ భిన్నంగా పూర్తి మాస్ అండ్ యాక్షన్ కోట్ తో సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మిక్స్ అయి ఉండటంతో మరింత పెద్ద విజయం అందుకుంది. పరుచూరి బ్రదర్స్ మాస్ డైలాగ్స్ కు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఇక బాలయ్య లాంటి హీరో ఉండగా కూడా ఓ హీరోయిన్ ను ఫైట్ సీన్ తో ఎంట్రీ చేయడం అప్పటికి రౌడీ ఇన్స్ పెక్టరే మొదటి సినిమా. విజయశాంతి ఎంట్రీ ఈ సినిమాలో ఓ మాంచి ఫైట్ సీన్ తోనే ఉంటుంది. బాలయ్య, విజయశాంతిల కెమిస్ట్రీ ఈ సినిమాలో అదిరిపోతుంది. అప్పటికే వీరి కాంబినేషణ్ లో చాలా సినిమాలు వచ్చినా.. ఇది ఇద్దరికీ మాస్ ఇమేజ్ వచ్చిన తర్వాత చేసిన సినిమా కావడంతో విజయశాంతికి కూడా సమానపాత్ర ఉంటుంది. కెవి మహదేవన్  సంగీతం అందించిన ఈ సినిమా పాటలు అప్పుడప్పుడే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తోన్న భువన చంద్ర రాయడం విశేషం. సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో రౌడీ ఇన్స్ పెక్టర్ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. మొత్తంగా 1992 మే7న విడుదలైన రౌడీ ఇన్స్ పెక్టర్ బాలయ్య కెరీర్ లో ఓ మెమరబుల్ మూవీగా నిలవడం విశేషం. 

More Related Stories