English   

శర్వానంద్ 27వ సినిమాకి ఆసక్తికరమైన టైటిల్ 

Ranarangam
2019-05-25 15:04:12

ఈ మద్య కాలంలో శర్వా కి సరైన హిట్స్ లేవు ఆయన ఎన్నో అశలు పెట్టుకున్న రిలీజ్ చేసిన ప‌డి ప‌డి లేచె మ‌న‌సు శ‌ర్వానంద్‌ కు నిరాశనే మిగిల్చింది. అయితే శ‌ర్వా చేతిలో ప్ర‌స్తుతం రెండు సినిమాలున్నాయి. డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ సినిమాను ఇప్ప‌టికే పూర్తి చేసిన శ‌ర్వా 96 రీమేక్ షూటింగ్‌లో ఉన్నాడు. సుధీర్ వ‌ర్మ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్త‌యి నిజానికి మే నెలాఖ‌రున విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే ఏమయిందో ఏమో కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల జూలై నెలకి వాయిదా వేశారు. అయితే అనేక కారణాల్లో టైటిల్ సమస్య ఒకటని అంటున్నారు. ఈ సినిమాకు మొద‌ట్నుంచి ద‌ళ‌ప‌తి టైటిల్‌ అనుకున్నారట‌. అయితే ఈ యూనిట్ కంటే ముందే వేరేవాళ్ళు ఈ టైటిల్‌ను రిజిస్ట‌ర్ చేయించ‌డంతో వీరికి ఇబ్బంది ఎదురైంది. దీంతో ర‌ణ‌రంగం, వ్యూహం లాంటి కొన్ని టైటిళ్లు పరిశీలించి చివరికి రణరంగం అనే టైటిల్ నే ఫిక్స్ చేశారట. ఈ సినిమాకి టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని పేర్కొంటూ నిన్న ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కథానాయికలుగా కాజల్, కల్యాణి ప్రియదర్శన్ సందడి చేయనున్నారు. 

More Related Stories