English   

రికార్డులు బద్దలు కొట్టిన ఘరానా మొగుడుకి 28 ఏళ్ళు 

 Gharana mogud
2020-04-09 13:56:50

చిరంజీవి నటించిన 'ఘరానా మొగుడు' సినిమా బాక్సాఫీస్ వద్ద పది కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమా అనే విషయం మీలో ఎంత మందికి తెలుసు. అవును నిజమే ఆయన నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పది కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది. చిరంజీవికి ఉన్న ఇండస్ట్రీ హిట్స్ లో ఈ "ఘరానా మొగుడు" ఒకటి. ఈ చిత్రం విడుదలై 28 యేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సిఇంమా 1992 ఏప్రిల్ 9న విడుదలైంది. చిరంజీవి సినిమాల్లో ఆల్‌ టైమ్ గ్రేట్ సినిమాగా ఇది ఒకటిగా నిలిచింది. ఈ సినిమా హిట్ కావడంతో దేశంలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకొనే నటుడిగా చిరంజీవి మారాడు. ఈ సినిమాలో 'కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో.. మాస్టారూ అంటూ పలికిన డైలాగ్స్ ఇప్పటికీ జనాల నోట వినిపిస్తూ ఉంటాయి. 

మెగాస్టార్ సరసన నగ్మా నటించిన ఈ సినిమా 56 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుని రచ్చ చేసింది. 1993లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియాలో కూడా ఈ సినిమాని ప్రదర్శించారు. అనురాగద అంతఃపుర అనే కన్నడ నవల ఆధారంగా1986లో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ‘అనురాగ ఆరళితు’ సినిమా చేశారు. దీన్ని మూలంగా అక్కడికి ఆరేళ్ళ తర్వాత తమిళ దర్శకుడు పి.వాసు రజనీకాంత్, విజయశాంతి, కుష్బూ లని పెట్టి మన్నన్ తెరకెక్కించారు. దానిని తీసుకుని రాగవేంద్ర రావు ‘ఘరానా మొగుడు’ తెరకెక్కించారు. చిరంజీవి, నగ్మా, వాణి విశ్వనాధ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కైకాల సత్య నారాయణ విలన్ పాత్రలో నటించగా అప్పటి దాకా చిరంజీవి హీరోగా నటించిన అన్ని సినిమాల్లో ప్రతినాయకుడిగా మెప్పించిన రావు గోపాలరావు ‘అల్లుడు శిష్యా..’ అంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. ఇక ఈ సినిమా 1994లో అనిల్ కపూర్-శ్రీదేవి హీరోయిన్లుగా లాడ్లా పేరుతో బాలీవుడ్ కి వెళ్లి అక్కడా విజయం సాధించింది ఈ సినిమా.

More Related Stories