English   

నాని 28..జంటగా రాజారాణి హీరోయిన్

 Nazriya
2020-11-13 19:54:26

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.ఈ మద్యే తన 25 వ సినిమా 'వి' తో ముందుకు వచ్చి నిరాశ పరిచాడు. ఈ సినిమా తనకు ఎంతగానో నచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. వీరిద్దరి కంబినేషన్లో  వచ్చిన అష్టాచెమ్మా, జంటిల్ మాన్,సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇక ప్రసుతం నాని 'టాక్ జగదీష్' సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా కరోనా వల్ల ఇంత కాలం నిలిచిపోయింది. దాని షూటింగ్ పూర్తవకుండానే 27 వ సినిమా 'శ్యామ్ సింగరాయి' పూర్తిచేసేపనిలో నాని  పడ్డాడు. ఈ సినిమాను 'టాక్సీవాల' మూవీ ఫేమ్ రాహుల్ సంకృతన్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా రెగులర్ షూటింగ్ ప్రారంభం కాకుండానే తన 28 వ సినిమాను కూడా ఒకే చేసాడు. 

తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.  సినిమాకు మెంటల్ మదిలో, బ్రోచేవారేవారురా సినిమాలతో మంచి విజయాలు సాధించిన వివేక్ ఆత్రేయ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో నాని కి జోడిగా మలయాళ భామ 'నజ్రియా నజీమా ను ఎంపిక చేశారు. ఈ ముద్దుగుమ్మ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన "రాజా రాణి" చిత్రంలో హీరో ఆర్య కు జోడిగా నటించింది. మిగతా నటి నటులు మరియు సాంకేతిక నిపుణుల గురించి వివరాలు ఈ నెల 21 తేదీని తెలియచేస్తామని మైత్రి మూవీ మేకర్స్ పేర్కొంది. ఇక ఈ సినిమాతో నాని హిట్ కొడతాడా లేదా చూడాలి. 
 

More Related Stories