English   

చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా ? 28°C టీజర్

28cd
2019-04-28 08:52:14

టాలీవుడ్ కి కొత్తగా వస్తున్న దర్శకుల ఆలోచనా ధోరణి మారింది. రొటీన్ సినిమాలు కాకుండా వినూత్నంగా ఆలోచిస్తూ విభిన్నమైన ప్రయోగాలతో ఆకట్టుకుంటున్నారు. ఆ కోవలోనే ‘28°C’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నవీన్‌ చంద్ర, వి. షాలినీ హీరోహీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేసింది ఆ సినిమా యూనిట్. టీజర్ ని బట్టి చూస్తే నవీన్ చంద్రకు ఓ ప్రమాదంలో బ్రెయిన్ ఇంజ్యురీ జరుగుతుంది. దాని వలన డాక్టర్ చెప్పిన సూచనల మేరకు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే ఈక్వేటర్ కి దగ్గరలో రూమ్ టెంపరేచర్ కి దగ్గరగా అనే 28'C టెంపరేచర్ లో ఉండటం. ఒకవేళ లేకపోతే 10 నుంచి 15 నిమిషాల లోపే అతను చనిపోతాడు. మరి ఇలాంటి పరిస్థితిని హీరో ఎలా దాటాడు ? అలాగే ‘చినిపోయిన వాళ్లు తిరిగి వస్తారా’? లాంటి డైలాగ్‌ని బట్టి ఇది ఒక హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ అని అర్ధం అవుతోంది. ఈ మూవీకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించాడు. త్వరలో విడుదలకు ప్లాన్ చేసిన ఈ 28'C లో ఏదో విషయం ఉందనే ఇంప్రెషన్ అయితే కలిగించారు అంటే సగం హిట్ కొట్టినట్టే.

More Related Stories