English   

మార్చి 29న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల.. కనీసం ఈసారైనా..

Lakshmis-NTR
2019-03-19 09:09:16

లక్ష్మీస్ ఎన్టీఆర్ కొత్త విడుదల తేది కన్ఫర్మ్ అయింది. ప్రతిసారి ఒక విడుదల తేదీ అరెస్ట్ చేయడం.. అక్కడి నుంచి పోస్ట్ పోన్ కావడం ఈ సినిమాకు పరిపాటిగా మారిపోయింది. ఎప్పటికప్పుడు వర్మ సోషల్ మీడియాలో తన సినిమా గురించి అప్డేట్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న సెన్సార్ బోర్డు పెద్ద ఇష్యూ అయిపోయి ఏకంగా కోర్టుకు వెళ్తానని సవాలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ నీ సమస్య సాల్వ్ అయిపోయిందని చిన్న మిస్ అండర్ స్టాండింగ్ తో ఇలాంటి సమస్యలు వచ్చాయని ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. చివరికి ఈ చిత్రాన్ని సెన్సార్ చేయడానికి బోర్డు ఒప్పుకుందని.. మార్చి 22 నుంచి 29 సినిమాను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు రామ్ గోపాల్ వర్మ. కచ్చితంగా మార్చి 29న లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.. అసలు నిజాలు ప్రేక్షకులు చూడడం ఖాయం అంటున్నారు ఈ దర్శకుడు. మరోవైపు తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ సినిమాను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది. ఏం చేయాలో తెలియక సెన్సార్ బోర్డు కూడా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే మరో ఆలోచన లేకుండా వాటికి కత్తెరతో పని చెప్పాలని.. సినిమాను ఏదో విధంగా జీవంలేని ప్రొడక్ట్ గా బయటకు తీసుకురావాలని తెలుగుదేశం భావిస్తోంది. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం సెన్సార్ బోర్డుతో కూడా కయ్యానికి సిద్ధమే అంటున్నాడు. తన సినిమా ఎవరిని ఉద్దేశించి కాదని.. కేవలం నిజాలు చెప్పడానికి మాత్రమే తీశాను అంటున్నాడు. ఎన్నికల సమయంలో ఇలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే ఖచ్చితంగా అది ఓట్లపై ప్రభావం చూపిస్తుందని చాలామంది నమ్ముతున్నారు. మరి ఇలాంటి సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 29న వచ్చి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. చాలా నమ్మకంగా సినిమా మార్చి 29న వస్తుంది అంటూ పోస్టర్ విడుదల చేశాడు.. కానీ సినిమా విడుదలయ్యేంత వరకు కూడా ప్రేక్షకుల్లో అనుమానాలు కనిపిస్తూనే ఉన్నాయి.

More Related Stories