English   

మే 29 వరకు అన్నీ బంద్.. క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ పెద్దలు..

tollywood
2020-05-12 19:21:57

కరోనా వైరస్ రోజురోజుకీ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఇప్పటికే రెండు నెలలు అవుతున్నా కూడా ఇంకా ఈ మహమ్మారి కరుణించడం లేదు. రోజురోజుకీ మరణాలు కూడా పెరుగుతున్నాయి. 3500 కేసులు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఇండియాలో 70 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. దాంతో అన్నీ స్థంభించిపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా సడలింపులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. కష్టమైనా పర్లేదు కానీ ఆర్థిక వ్యవస్థను బతికించుకోవాలంటే తప్పదని.. కరోనాతో సహ జీవనం చేయాల్సిందే అని నాయకులు కూడా చెప్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నెలలుగా లాక్‌డౌన్ విధించాయి. ఇండస్ట్రీపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

షూటింగ్ లు ఆగిపోవడంతో చిత్ర పరిశ్రమ అన్ని రకాలుగా కుదేలైపోయింది. వేల కోట్ల నష్టాలు వస్తున్నాయి. అయితే కేరళ , తమిళనాడు వంటి రాష్ట్రాలు షూటింగ్ పూర్తైన సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు చేసుకోవచ్చంటూ అనుమతులు ఇచ్చాయి. దాంతో టాలీవుడ్ లో కూడా ఇలాంటి అనుమతులు వస్తాయేమో అని చూస్తున్న వాళ్లకు ఇక్కడి పెద్దలు షాక్ ఇచ్చారు. తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు అంటే మే 29 వరకు కూడా ఎలాంటి సినిమా పనులు జరిగే అవకాశం లేదని తెలుస్తుంది. తెలంగాణా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావు దీనిపై స్పష్టత ఇచ్చారు.. మే 29 వరకు లాక్ డౌన్ పూర్తయ్యే వరకు సినిమాలకి సంబంధించిన ఎలాంటి పనులను నిర్వహించరాదని తెలంగాణా గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. దీనితో బడా నిర్మాతలకు షాక్ ఇచ్చినట్లు అయింది. మొత్తానికి మరో 20 రోజులు ఈ తిప్పలు తప్పేలా కనిపించడం లేదు.

More Related Stories