English   

సాహోకు రావాల్సింది 290.. వచ్చింది ఎంతో తెలుసా..

 Saaho
2019-09-03 09:24:48

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహో ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఈ చిత్రం మొదటి వారాంతంలో అద్భుతాలు చేసింది. మూడు రోజుల్లోనే అన్ని భాషలలో కలిపి దాదాపు 153 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగులో 60 కోట్లు.. హిందీలో 50 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది సాహో. మిగిలిన చోట్ల మరో 40 కోట్లకు పైగానే షేర్ వచ్చింది. మూడు రోజుల్లో టాప్ 3 అల్ టైమ్ తెలుగు హిట్స్ లో ప్రభాస్ చోటు సంపాదించాడు. ఇప్పటికే బాహుబలి పార్ట్ 1,2లు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు సాహో కూడా అందులో చేరిపోయింది. ఫస్ట్ వీకెండ్.. వినాయక చవితి హాలీడే సందర్భంగా అంచనాలకు మించి పర్ఫార్మ్ చేస్తున్నా కూడా బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే మాత్రం సాహూ మరో ప్రపంచ యుద్ధం చేయాల్సిందే. ఈ చిత్రం ఇప్పటి వరకు వసూలు చేసిన దానికి రెట్టింపు చేయాల్సిందే. అంటే మరో 150 కోట్లు వసూలు చేస్తే కానీ హిట్ అనిపించుకోదు. ప్రపంచవ్యాప్తంగా 290 కోట్ల వరకు సాహో బిజినెస్ జరిగింది. అంటే హిట్ కోసం 300 కోట్లు తీసుకురావాల్సిందే. ఇప్పటి వరకు 52% మాత్రమే వసూళ్లు వచ్చాయి. ఇప్పట్నుంచీ అసలు పరీక్ష మొదలు కాబోతుంది. ప్లాప్ టాక్ తో ఈ సినిమా ఎంత దూరం వెళ్తుందనేది చూడాలి. ఇప్పుడే ఇలా కలెక్షన్లు వస్తున్నాయంటే.. నిజంగా ఒకవేళ సాహోకు పాజిటివ్ టాక్ వచ్చుంటే మాత్రం నిజంగానే బాహుబలి రికార్డులు కూడా కదిలిపోయేవి అంటున్నారు ప్రభాస్ అభిమానులు.

More Related Stories