English   

బిగ్ బాస్ 3' హోస్ట్  గా వెంకటేష్  ?

Venkatesh
2019-01-01 08:36:16

బుల్లి తెర సంచలనం బిగ్ బాస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడవ సీజన్ కు సిద్దమయ్యింది. 'బిగ్ బాస్' సీజన్ 1కి  హోస్ట్ గా ఎన్టీఆర్ మెప్పించగా 'బిగ్ బాస్ 2' కి హోస్ట్ గా నాని మొదట భయపెట్టినా ఆ తర్వాత ఫర్వాలేదని పించాడు. ఇక 'బిగ్ బాస్ 3' కోసం విజయ్ దేవరకొండను రంగంలోకి దింపుతున్నట్టుగా సీజన్ 2 నడుస్తున్నప్పుడే గాసిప్ లు వచ్చాయి. విజయ్ కాక అల్లు అర్జున్ చేసే అవకాశం ఉందని, కాదు ఎన్టీఆరే మళ్ళీ రంగంలోకి దిగుతాడని ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా మరో సీనియర్ హీరో పేరు తెర మీదకి వచ్చింది. ఈ బిగ్ బాస్ నిర్వాహకులు ఇటీవలే వెంకటేశ్ తో సంప్రదింపులు జరిపారనేది ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మామూఒలుగా విక్టరీ వెంకటేష్ మీడియా, టివి లాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. అలాంటిది వెంకీ పేరు ఇప్పుడు ఏకంగా హోస్ట్ అని ప్రచారం జరగడం సినీ ప్రేక్షక వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే ఇప్పటివరకూ అన్ని షోలకూ దూరంగా ఉండే వెంకీ బిగ్ బాస్ షో గనుక అంగీకరిస్తే ఆయన బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరవడం, షో సూపర్ హిట్ కావడం ఖాయమని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోంది. ఈ ఏడాది జూన్ నెల నుండి బిగ్ బాస్ సీజన్ 3 మొదలుకానుందని సమాచారం. అయితే ఈ విష్యం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories