English   

బిగ్ బాస్ 3 ఎవ‌రు.. అభిమానుల్లో పెరిగిపోతున్న ఆస‌క్తి.. 

Exciting news on Telugu Bigg Boss 3 host
2019-01-03 21:53:42

కట్టుకున్నోడు వదిలేశాడు.. పుట్టింటోళ్లు తరిమేశారు పాట గుర్తుంది కదా. ఇప్పుడు బిగ్ బాస్ షో ను చూస్తుంటే అనిపిస్తుంది. హిందీలో 13 సీజన్లు ఒకే హోస్ట్ తో న‌డిపారు నిర్వాహకులు. కానీ తెలుగులో మాత్రం వీళ్లకు ఎక్కడలేని ఇబ్బందులు అన్ని వస్తున్నాయి. తొలి సీజన్ కు ఎన్టీఆర్ ను హోస్ట్ గా ఒప్పించి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగులో ఇంత పెద్ద విజయం సాధించడానికి ఎన్టీఆర్ కూడా ఓ కారణమే. ఇక ఆ తర్వాత నాని ఈ కార్యక్రమాన్ని నిలబెట్టాడు. ఎన్టీఆర్ రేంజ్ లో కాకపోయినా కూడా బిగ్ బాస్ 2 కూడా పర్లేదనిపించింది. మంచి రేటింగ్స్ సాధించింది. దాంతో ఇప్పుడు మూడో సీజన్ కు ఎవ‌రు హోస్ట్ గా వస్తారు అని ప్రచారం ఇండస్ట్రీలో జోరుగా జరుగుతోంది. అభిమానుల్లో కూడా ఇవే అనుమానాలు ఉన్నాయి. 
రాజమౌళి సినిమాతో బిజీగా ఉండడంతో ఇప్పుడు ఎన్టీఆర్ బిగ్ బాస్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.. మరోవైపు నాని కూడా వరస సినిమాలు చేస్తుండటంతో బిగ్ బాస్ కు ఈ సారి సారి చెప్పాలని చూస్తున్నాడు. ముందు నుంచి రియాల్టీ షోలో అనుభవం ఉన్న నాగార్జునను ఒప్పించాలని ప్రయత్నించినా కూడా ఆయన కూడా ఎందుకో బిగ్ బాస్ వైపు ఆసక్తి చూపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వెంకటేష్ ను తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. కానీ అక్కడ కూడా ప్రయత్నం బెడిసి కొట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఈయనకు రియాలిటీ షోలు అన్నా.. టీవీ షోలో అన్నా కూడా పెద్దగా పడదు. దాంతో వెంకీ కూడా బిగ్ బాస్ నుంచి తప్పుకున్నట్లే. మరి ఇప్పుడు ఈ స్థానంలోకి ఎవరు వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.

More Related Stories