English   

కాంచన 3 ఫస్ట్ లుక్...యాంగ్రీ మెన్ గా లారెన్స్ !

Kanchana-3
2019-01-09 15:24:19

డాన్స్ కోరియోగాఫర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి న‌టుడు ఆపైన ద‌ర్శ‌కుడిగా పాపులర్ అయ్యాడు లారెన్స్. ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన కాంచన సిరీస్ ఎంత హిట్ అయ్యయో తెలిసిందె. ఆయన తాజాగా తెర‌కెక్కించిన సినిమా కాంచ‌న 3. కాంచ‌న సిరీస్‌ లో నాలుగో భాగంగా వ‌చ్చిన కాంచ‌న 3ని లారెన్స్ దర్శకత్వం వహిస్తూనే నిర్మించారు. వేదిక‌, నిక్కీ తంబోలి, ఓవియా మెయిన్ లీడ్స్ గా న‌టించిన ఈ సినిమా షూటింగ్ నిన్నటితో పూర్తైంది. లారెన్స్‌, నిక్కీ తంబోలీ, వేదిక ఒక‌రికొక‌రు కేక్ క‌ట్ చేసుకొని తినిపించుకున్న ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అంతేకాక ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ వ‌దిలారు. రుద్రాక్షలు ధరించి జుట్టు నెరిసిన మధ్య వయస్కుడిగా స్టైల్ గా, లారెన్స్ కాలుపై కాలు వేసుకుని కూర్చున్న పోస్టర్ అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు లారెన్స్. క‌బీర్ దుహ‌న్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ముని, గంగ, కాంచన  ఇలా ఇన్ని హారర్ థ్రిల్లర్స్ తో ప్రేక్షకులని భయపెట్టిన లారెన్స్ ఈ సినిమాలో ఇంకెంతగా భయపెడతాడో చూడాలి మరి. 

More Related Stories