English   

బిగ్ బాస్ 3 కంటెస్టంట్స్ వీరే !

Bigg-Boss-3
2019-01-10 18:20:49

తొలుత బాలీవుడ్ లో సూపర్ హిట్ కావడంతో ఆ బిగ్ బాస్ సౌత్ కు కూడా వచ్చింది. దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ ఈ షో రన్ అవుతోంది. మిగతా బాషల సంగతి పక్కన పెడితే టాలీవుడ్ బిగ్ బాస్ కూడా మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవడంతో ఇప్పుడు మూడవ సీజన్ మొదలు కాబోతోంది.  తెలుగులో సీజ‌న్ వన్ లో ఎన్టీఆర్ హోస్ట్‌గా అదరగొట్టగా, సెకండ్ సీజ‌న్‌ ని నాని హోస్ట్ చేసి ఫర్వాలేదనిపించాడు. దానికి మరిన్ని కారణాలు కూడా లేకపోలేదు ఎందుకంటే సెకండ్ సీజ‌న్‌ లో పెద్ద‌గా పాపుల‌ర్ వ్య‌క్తులు ఎవరూ లేక‌పోవ‌డంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. అదీ కాక సీజన్ 2 షూటింగ్ హైదరాబాద్ లో జరగడంతో ఒక రోజు ముందే షోకి సంబంధించిన విషయాలు బయటకి వచ్చేసేవి. ఈ నేప‌థ్యంలో ఈసారి మాత్రం హైదరాబాద్ లో బిగ్ బాస్ సెట్ వేయడం లేదని తెలుస్తోంది.  ఇకపోతే బిగ్ బాస్ 3 సీజ‌న్‌ కి ఈ సారి హోస్ట్‌గా విక్ట‌రీ వెంక‌టేష్ ఉంటార‌ని ప్రచారం జ‌రుగుతోంది. ఇక కంటెస్టెంట్‌ లుగా ఈసారి పాపుల‌ర్ వ్య‌క్తుల‌నే తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. తాజాగా బిగ్ బాస్ 3కి సంబంధించిన ఫైనల్ లిస్టు ఇదేనంటూ ఓ లిస్టు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. దాని ప్రకారం నటి రేణు దేశాయ్, నటి గద్దె సిందూర, నటి శోభిత ధూళిపాల, నటుడు వరుణ్‌ సందేశ్, యాంకర్ ఉదయభాను, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, సింగర్ హేమచంద్ర, జబర్ధస్త్ పొట్టి నరేశ్, నటుడు జాకీ, సింగర్ చైతన్య కృష్ణ, నటుడు మనోజ్ నందం, నటుడు కమల్ కామరాజు, నటి నాగ పద్మిని, యూట్యూబ్ సెలెబ్రిటీ 'మహాతల్లి' ఫేమ్ జాహ్నవి ఉన్నారు. అయితే ఇది ఫైనల్ లిస్టు అంటూ ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.  

More Related Stories