English   

బిగ్ బాస్ 3 గురించి ఈ పుకారు విన్నారా ? పీక్స్ అసలు !

victory venkatesh about big boss 3
2019-01-12 16:03:51

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 గురించి ఇప్పటికే రకరకాలుగా పుకార్లు వినిపిస్తుండగా తాజాగా వచ్చిన పుకారు మాత్రం పీక్స్ లో ఉంది. సీజన్‌ 3 గురించి రొజూ పెద్ద ఎత్తున వార్తలు ఏదో ఒక రకంగా వస్తూనే ఉన్నాయి. ముందు నుండీ చిరంజీవి, వెంకటేష్‌ లలో ఒకరు బిగ్‌బాస్‌కు హోస్ట్ గా షో చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ వార్తల పై ఇటీవలే ఎఫ్2 ప్రమోషన్స్ లో ఉన్న వెంకటేష్‌ స్పందిస్తూ అలాంటిది ఏమీ లేదన్నాడు. ఇక చిరంజీవి ప్రస్తుతం సైరా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నారో విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా సినీ జనాలు మాత్రం పుకార్లు పుట్టిస్తునే ఉన్నారు. బిగ్ బాస్ సీజన్‌ 3 గురించి కూడా మరో ఆసక్తికర వార్త పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, అదేంటంటే ఈ షోకు హోస్ట్‌గా రెండవ సీజన్ టైటిల్ విన్నర్ కౌశల్‌ వ్యవహరించబోతున్నాడట. మాటీవీ అలాగే బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్‌ 3కి కౌశల్‌ అయితే బాగుంటుందని భావిస్తున్నారని, కౌశల్‌ ముక్కుసూటి తనం కిందటి సీజన్ లో మంచి రేటింగ్స్ తెచ్చిపెట్టడంతో ఈసారి హోస్ట్ చేయిస్తే ఆ రేటింగ్స్ ని మళ్ళీ సాధించవచ్చని భావిస్తున్నారని అందుకే బిగ్‌ బాస్‌ నిర్వాహకులు చర్చలు జరుపుతున్నారని పుకార్లు వస్తున్నాయి. టాలీవుడ్ కి పుకార్లు కొత్త కాదు కాని, ఇలాంటి పుకార్లు వింటుంటే వామ్మో అనిపిస్తుంది. బిగ్ బాస్ యాజమాన్యం అధికారిక ప్రకటన ఇస్తే గానీ ఈ పుకార్లకి బ్రేక్ పడేలా లేదు

More Related Stories