English   

బిగ్ బాస్ 3 హోస్ట్ ఆయనేనా ?

Nagarjuna
2019-03-19 10:13:56

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1, సీజన్2 లకు ప్రేక్షకాదరణ గట్టిగానే లభించడంతో సీజన్ 3కి కూడా సన్నాహాలు మొదలయ్యాయి. తెలుగులో మొదటి సీజన్ 2017 జూలై 16న ప్రారంభించారు. ఇక రెండో సీజన్ 2018 జూన్ 10న సీజన్ 2 స్టార్ట్ చేశారు. మొదటి సీజన్ ఎన్టీఆర్, రెండో సీజన్ నానిలు హోస్ట్ చేశారు. మొదటి సీజన్ టీఆర్పీ విషయంలో టాప్ గా నిలవగా రెండో సీజన్ కూడ ఫర్వాలేదు అనిపించుకుంది.  బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా శివబాలాజీ,  సీజన్ 2 విజేతగా కౌశల్ నిలిచారు. అంటే ఈ ఏడాది కూడా సీజన్ మొదలవడానికి పెద్దగా సమయం లేదు. అయినా సీజ‌న్ 3కి హోస్ట్ ఎవ‌రు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. రోజుకో పేరు వినిపిస్తుంది కానీ బిగ్ బాస్ 3 ఎవ‌రు అనేది మాత్రం ఇప్ప‌టికీ ఒక బిగ్ ప్రశ్నే. ఈ సీజన్ కి వెంక‌టేశ్, చిరంజీవి, నాని, ఎన్టీఆర్, రానా, విజయ్ దేవరకొండ, ఇలా చాలా పేర్లు వినిపించినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారు. అందుకే ఎలాగైనా ఆయ‌న్నే సీజ‌న్ 3కి ఒప్పించాల‌ని చూస్తున్నారు నిర్వాహకులు. కానీ ఈయ‌న రాజ‌మౌళి సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. జక్కన్న సినిమా చేస్తూ బ‌య‌ట షోలు చేయ‌డం అంటే కుదరని పని, ఎందుకంటే లుక్ సహా అన్నీ బహిర్గతం అవుతాయని ఆయన అంగీకరించడు. సో ఇప్పుడు ఈ లిస్ట్ లోకి నాగార్జున పేరు వచ్చింది. ఎందుకంటే ఆయన ఇంతకు ముందే మా టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేశాడు.  అందుకే ఆయన అయితేనే బిగ్‌బాస్ 3ని కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలడని మా టీవీ, బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. ప్రస్తుతం నాగార్జున తన సొంత బ్యానర్‌లో మన్మథుడు సీక్వెల్ తో పాటు బంగార్రాజు ప్రీక్వెల్ చేయడానికి సన్నాహాల్లో ఉన్నాడు. ఎలాగో రెండూ సొంత సినిమాలే కాబట్టి బిగ్‌బాస్ 3ప్రోగ్రాంను హోస్ట్ చేయడానికి వీలుగా ఆయన ప్లాన్ చేసుకోవచ్చు. అందుకే నాగార్జున బిగ్ బాస్ 3 హోస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  

More Related Stories