English   

బిగ్ బాస్ 3 కొత్త ట్విస్ట్: నాగ్ కాదట !

Nagarjuna
2019-03-21 09:38:27

ఈ మధ్య కాలంలో మళ్ళీ బిగ్ బాస్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంకా అది ప్రారంభం కావడానికి కొద్ది రోజులే ఉండడంతో ఈసారి ఈ షోని ఎవరు హోస్ట్ చేస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి రోజుకొక గాసిప్ వస్తూనే ఉంది. ఇప్పటికే ఈ షో కి సంబంధించి నాగార్జున, ఎన్టీఆర్, వెంకటేష్, విజయ్ దేవరకొండ పేర్లు వినపడగా నిన్నటి నుండి నాగార్జునని నిర్వాహకులు సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ షో నిర్వహకులు నాగార్జునను సంప్రదించిన విషయం నిజమే అయినా అయన ఈ ఆఫర్‌కు ఆయన ఒప్పుకోలేదని సమాచారం. ఆయన ఒప్పుకున్న ప్రాజెక్టులను సత్వరమే మొదలు  పెట్టాల్సి ఉండడంతో తాను హోస్ట్‌గా చేయలేనని నాగార్జున చెప్పేశారని అంటున్నారు. దీంతో మళ్ళీ వేటలో పడ్డ బిగ్ బాస్ టీం రౌడీ విజయ్ దేవరకొండను ఒప్పించే పనిలో పడిందట. ఇప్పటికే విజయ్ దేవరకొండను స్టార్ మా టీం సంప్రదించిందని అంటున్నారు. అయితే ఆయన ఏమన్నాడు చేస్తారా ? చేయరా ? అనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. 
 

More Related Stories