English   

కాంచన 3 ట్రైలర్....లుక్ అదరకొట్టాడు !

Kanchana-3
2019-03-28 11:36:20

ముని సిరీస్‌ లో వస్తున్న నాలుగో సినిమా కాంచ‌న 3. నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ నటిస్తూ ఆయనే దర్శకత్వం చేస్తున్నారు. వేదిక‌, నిక్కీ తంబోలి, ఓవియా క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా  ప్ర‌మోష‌న్స్ ని వేగ‌వంతం చేశారు మేకర్స్. తాజాగా త‌మిళ వ‌ర్షెన్‌కి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌ల చేసింది సినిమా యూనిట్.  ఈ సిరీస్‌లో గత చిత్రాల మాదిరిగానే ‘కాంచన 3’ కూడా విపరీతంగా భయపెడుతోంది. ఇందులోని స‌న్నివేశాలు మ‌రింత భ‌యంక‌రంగా ఉన్నాయి. లారెన్స్ త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో కొత్త లుక్‌ తో అద‌రగొట్టాడు. పూర్తిగా నెరిసిన జట్టు, గడ్డం, మీసంతో లారెన్స్ లుక్ చాలా కొత్తగా భీతి గొలిపేలా ఉంది.  గత చిత్రాల లైన్ లోనే వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించనున్నాడు క‌బీర్ దుహ‌న్. ఇక ఈ సినిమాకి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో కాంచ‌న చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్నాడ‌ని వార్తలు వస్తున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది. కాంచన 3 ట్రైలర్ చూస్తే మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టేట్టే ఉంది.

 

More Related Stories