English   

కాంచన 3 సెన్సార్ టాక్ !

Kanchana-3 Censor Talk
2019-04-09 09:32:02

లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ముని సిరీస్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యయో మనకి తెలియనిది కాదు. ఇప్పుడు అదే సిరీస్ లో వస్తున్న సినిమా కాంచన 3. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో లారెన్స్ సరసన వేదిక ఓవియా నిక్కీ తంబోలీలు నటించిన ఈ సినిమాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సినిమా చుసిన సెన్సార్ బోర్డు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు మరింతగా భయపెట్టేలా ఉండటంతో సినిమా మీద అంచనాలు గట్టిగానే ఉన్నాయి. లారెన్స్ డిఫరెంట్ లుక్ తో కనిపించే ఈ సినిమాని లారెన్స్ సొంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ మీద నిర్మించారు ఇక ఈ సినిమాని  ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో విడుదలచేస్తున్నారు.

More Related Stories