English   

చిక్కుల్లో దబాంగ్ 3...ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నోటీసులు 

Salman Khan Dabangg 3 gets notice from ASI
2019-04-12 20:51:49

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న దబాంగ్ 3 సినిమా షూటింగ్ ఇటీవలే ఇండోర్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అలా మొదలయ్యిందో లేదో కానీ ఈ సినిమా చుట్టూ వివాదాలు చుట్టూ ముడుతున్నాయి. ఈ సినిమాలో కీలక సన్నివేశాలు షూట్ చేయడం కోసం ధర్ కు సమీపంలో మండులోని జల్ మహల్ లో రెండు సెట్స్ ను అక్రమంగా నిర్మించారని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పేర్కొంది. జల్ మహల్ లో అక్రమంగా నిర్మించిన రెండు సెట్స్ ను తొలగించాలని చిత్ర నిర్మాణ సంస్థకు ఏఎస్ఐ జూనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ పేరిట నోటీసులు జారీ అయ్యాయి. ఏఎస్ఐ ఆదేశాలను పాటించకపోతే సినిమా షూటింగ్ రద్దు చేయడం జరుగుతుందని నోటీసుల్లో పేర్కొన్నారు. అదేమిటో కానీ ఈ సినిమా ప్రారంభం నుండే పలు వివాదాల్లో చిక్కుకుంది.

More Related Stories