English   

కాంచన 3 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్...అదుర్స్ !

Kanchana 3
2019-04-22 10:32:22

హార్ర‌ర్ కామెడీ చిత్రాలతో ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌కత్వం లో కాంచన సిరీస్ నుంచి వచ్చిన హార్ర‌ర్ కామెడీ చిత్రం కాంచ‌న‌-3. మొదటి రెండు భాగాలూ సూపర్ హిట్స్ కావడం తో మూడో భాగం మీద భారీ అంచనాలే ఉన్నాయి. కానీ అంచనాలకు తగ్గట్టు సినిమా లేకున్న్డా, మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయినా ‘ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది కాంచన.  తెలుగు తో పాటు తమిళ్ లో ఒకే రోజు విడుదలైన ఈ మూవీ రెండు చోట్ల భారీ విజయాన్ని అందుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతుంది. తమిళనాడు లో ఈ చిత్రం మొదటి రోజు 10. 72 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి లారెన్స్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టించింది. తెలుగులో రూ.6 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ ఫస్ట్ వీకెండ్ తెలుగు రాష్టాల్లో ఈ సినిమా వసూళ్లు ఏంటో చూద్దాం. నైజాం.... 3.05, సీడెడ్ ... 2.05, కృష్ణా... 69.23, వైజాగ్...... 96.04, నెల్లూరు ... 32.06, గుంటూరు ... 85, తూర్పు ..... 75, పశ్చిమ. ... 46. ఇలా మొత్తం కలిపి మొదటి మూడు రోజుల్లో తొమ్మిది కోట్ల పదమూడు లక్షల ముప్పై మూడు వేలు కలెక్షన్లు రాబట్టింది.

More Related Stories