English   

బిగ్ బాస్ 3...కంటెస్టెంట్‌లు వీళ్ళేనా ? 

Bigg Boss 3
2019-04-23 11:30:18

తెలుగునాట పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3కి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మూడో సీజన్‌ కోసం హోస్ట్‌తో పాటు కంటెస్టెంట్స్‌ను వెతికే పనిలో పడింది స్టార్ మా సంస్థ. బిగ్‌ బాస్ 3 సీజన్‌ గురించి రోజుకో గాసిప్‌ పుట్టుకొస్తూనే ఉంది. తాజాగా ఈసారి బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్లే తారల లిస్ట్‌లో బుల్లితెర రొమాంటిక్ జోడీగా ముద్ర పడిన రష్మీ, సుడిగాలి సుధీర్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొంత మంది పేర్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. టీవి నటి హరిత, కుర్ర హీరో వరుణ్ సందేశ్, సింగర్ హేమ చంద్ర, హీరో కమల్ కామరాజు, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్, బ్యాడ్మింటన్ తార గుత్తా జ్వాల, హీరో మనోజ్ నందన్, జబర్దస్త్ పొట్టి నరేష్, నటి కరాటే కళ్యాణి, ఒకప్పటి యాంకర్ ఉదయభాను,  కొరియోగ్రాఫర్ రఘు, బిత్తిరి సత్తి,  కామన్‌ మెన్ 1, కామన్ ఉమెన్ 1 అని చెబుతున్నారు. మూడో సీజన్‌కి హోస్ట్‌ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. మరోసారి నానీ, ఎన్టీఆర్ పేర్లు వినిపిస్తుండగా తాజాగా అనుష్క పేరు తెరమీదకు వచ్చింది. బిగ్ బాస్ సీజన్‌ 3 అఫీషియల్ కంటెస్టెంట్‌లు ఎవరనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే.

More Related Stories