English   

బిగ్ బాస్ 3 ఫైనలిస్ట్స్ వీరే

biggboss3
2019-04-26 22:00:19

తెలుగు రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో బాగా పాపులర్ అయ్యింది. జనాలు బిగ్ బాస్ కోసం పనులు అన్నీ మానుకుని కూర్చుటున్నారంటే దానికి వచ్చిన క్రేజ్ మనకి అర్ధం అవుతుంది. మొదటి రెండు సీజన్లు విజయంవంతంగా పూర్తవడంతో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ 3లో హోస్ట్ గా నాగార్జున, అనుష్క పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ 3లో హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ మీద కూడా చాలా పేర్లు వినిపించినా చివరికి కొందరిని ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం  బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్స్ వీళ్లేనట మహాతల్లి ఫేమ్ జాహ్నవి, అమ్మని రా అంటూ ఫేమస్ అయిన జ్యోతి, హీరోయిన్ శోభిత ధూళిపాళ, జబర్దస్త్ నరేష్, యాంకర్ ఉదయభాను, టీవీ ఆర్టిస్ట్ జాకీ, హీరో వరుణ్ సందేశ్, రేణు దేశాయ్,ఆర్టిస్ట్ చైతన్య కృష్ణ, ఆర్టిస్ట్ మనోజ్ నందం, కమల్ కామరాజు, నాగ పద్మిని, డాన్స్ మాస్టర్ రఘు, సింగర్ హేమ చంద్ర, గద్దె సింధూర, గుత్తా జ్వాల మొత్తం 13మంది పేర్లను ఖారారు చేసినట్టు తెలుస్తుంది. జూన్ మొదటి వారంలో షో ప్రారంభంకానున్నట్లు చెబుతున్నారు.

More Related Stories