English   

బిగ్ బాస్ 3లో సంచ‌ల‌న తార‌లు.. నాగార్జున హోస్ట్‌గా షో..

biggboss3
2019-06-03 20:03:11

బిగ్‌బాస్ సీజన్ 3 మొదలు కాకముందే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పటికే తొలి రెండు సీజన్‌లు మంచి పేరు తెచ్చుకోవడంతో మూడవ సీజన్ కూడా అలాగే ఉండాలని ప్లాన్ చేస్తున్నారు షో నిర్వాహకులు. ఇంకా చెప్పాలంటే తొలి రెండు సీజన్‌లతో పోలిస్తే మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్న బిగ్‌బాస్ సీజన్ వన్ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత నాని పోస్ట్ చేసిన రెండో సీజన్ పర్లేదు అనిపించుకుంది. దాంతో మూడవ సీజన్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలనే ఉద్దేశంతో నాగార్జునను హోస్ట్‌గా తీసుకొస్తున్నారు నిర్వాహకులు. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు కానీ నాగార్జున మాత్రం మూడో సీజన్ కోసం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన మన్మధుడు 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయిన తర్వాత బిగ్‌బాస్ సీజన్ 3 కోసం నాగార్జున సిద్ధం కానున్నాడని తెలుస్తోంది. ఇక ఇందులో కంటెస్టెంట్స్ కూడా భారీగానే ఉన్నారు. తొలి రెండు సీజన్స్ మాదిరి తెలిసి తెలియని సెలబ్రిటీస్ కాకుండా స్టార్స్‌నే తీసుకొస్తున్నారు.

రాజకీయాల్లో ఫుల్ కామెడీ చేస్తూ కడుపుబ్బా నవ్వించిన కేఏ పాల్ బిగ్‌బాస్ సీజన్ 3లో ఉన్నాడని తెలుస్తుంది. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా మూడో సీజన్లో భాగంగా కాబోతుందని ప్రచారం జరుగుతుంది. దాంతో బిగ్‌బాస్ సీజన్ 3పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. వీళ్లతో పాటు మరో 12 మంది సెలబ్రెటీలు కూడా మూడో సీజన్లో భాగం కానున్నారు. ఇప్పటికే తమిళ బిగ్ బాస్ మొదలైపోయింది. దాంతో తెలుగు కూడా వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని చూస్తున్నారు నిర్వాహకులు. చూడాలిక.. చివరికి ఏం జరుగుతుందో..?

More Related Stories