English   

బిగ్ బాస్ 3 సీజన్ ఆయన చేతిలోనేనా ?

 Nagarjuna
2019-06-07 13:02:52

తెలుగులో వచ్చిన రెండు సీజన్స్‌లోను బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన రియాలిటీ షో బిగ్‌ బాస్‌, తెలుగులో తొలి సీజన్‌ను ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేయగా, రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఒక మూడో సీజన్‌ 3 ఎప్పుడు మొదలవుతుందా, హోస్ట్‌ ఎవరు అనే దానిపై కొన్నాళ్లుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ మళ్ళీ మూడో సీజన్ హోస్ట్ చేస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చినా ఆ త‌ర్వాత నాగార్జున‌, అనుష్క, నాని, విజయ్ దేవరకొండ ఇలా ప‌లువురి పేర్లు ప్రచారంలోకి వ‌చ్చాయి. ఇక అందుతున్న తాజా స‌మాచారం ప్ర‌కారం మీలో కోటీశ్వ‌రుడు వంటి రియాలిటీ షోతో బుల్లితెర మీద కూడా మంచి రేటింగ్స్ అందుకున్న అక్కినేని నాగార్జుననే బిగ్ బాస్ 3ని హోస్ట్ చేయ‌నున్నాడ‌ని మరో ప్రచారం ఊపందుకుంది. ఇక ఈ విషయాన్ని రెండో సీజన్‌ లో పాల్గొన్న సామ్రాట్‌ ఓ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్నార‌ట‌. ఇక మ‌రో పక్క బిగ్ బాస్ 3లో పాల్గొనే కంటెస్టంట్ల ఎంపిక కూడా జ‌రుగుతోంది. ఇక జూలైలో ఈ షో ప్రారంభం కానుందని చేబుతున్నారు. మరోపక్క నాగార్జున మ‌న్మ‌థుడు సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా పోర్చుగ‌ల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లో మ‌రో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. 

More Related Stories