బిగ్ బాస్ 3...ఈసారికి ఆయనే....క్లారిటీ ఇచ్చేసిన మా టీవీ

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ప్రోమో వచ్చేసింది. బిగ్ బాస్ 3 సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈ సీజన్లో కంటెస్టెంట్లుగా ఎవరు ఉండనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ హోస్ట్ ఎవరనే విషయం రకరకాల ప్రచారాలు జరిగాయి. ఫస్ట్ సీజన్లో హోస్ట్‌గా చేసిన తారక్ తర్వాతి సీజన్ చేయలేదు, రెండో సీజన్లో నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఈసారి నాని స్థానంలో కొత్త హోస్ట్ ఎవరనే విషయమై తీవ్ర ప్రచారం జరిగింది. రకరకాల ప్రచారాలు జరిగినా నిన్న రాత్రి సమయంలో హోస్ట్ విషయమై మా టీవీ అఫీషియల్‌గా ప్రకటన చేసింది. మీలో ఎవరు కోటీశ్వరుడు షోను విజయవంతంగా నడిపిన నాగార్జున ఈ సీజన్లో హోస్ట్‌గా వ్యవహరిస్తారని మా టీవీ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ల కోసం వంద రోజులకు సరిపడా కూరగాయలు ఆయిల్ లాంటి సరుకులు కొనడానికి నాగ్ స్వయంగా మార్కెట్‌కి వెళ్లినట్టుగా నాగార్జునతో ప్రొమో వదిలింది. ఈసారి నేను రంగంలోకి నేను దిగుతున్నానంటూ.. నాగ్ బిగ్ బాస్ ప్రారంభానికి ముందే ప్రోమోతో ఆకట్టుకున్నారు. అయితే ఇప్పటిదాకా 16 మంది ఉంటారని ప్రచారం జరిగినా కంటెస్టెంట్లు 14 మందే ఉంటారని నాగార్జున తేల్చాడు. జూలై 21 నుంచి బిగ్ బాస్ 3 ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. అది ఎంత వరకూ నిజం అవుతుందో చూడాలి మరి.