English   

బిగ్ బాస్ 3 లోకి జంటగా అడుగుపెడుతున్న భార్య భర్తలు..

Varun Sandesh
2019-07-02 19:00:28

బిగ్ బాస్ సీజన్ 3పై తెలుగులో ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు నాగార్జున హోస్ట్ కావడంతో ఎక్కడలేని ఆసక్తి పెరిగి పోతుంది. అందరిలోనూ జూలైలో బిగ్బాస్ సీజన్ 3 మొదలు కానుంది. దాంతో ఇప్పటి నుంచే షో నిర్వాహకులు కూడా దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏకంగా 100 రోజుల పాటు ఆ ఇంట్లో ఉండగలిగే సత్తా ఉన్న కంటెస్టెంట్ లను వెతికి మరి పట్టుకుంటున్నారు. అందులో భాగంగానే సింగర్ హేమచంద్ర, ఉప్పల్ బాలు, v6 తీన్మార్ సావిత్రి, యాంకర్ ఉదయభాను లాంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో సెన్సేషనల్ జోడి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. ఇన్నిరోజులు కేవలం వరుణ్ సందేశ్ మాత్రమే ఆ ఇంట్లోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన భార్య వితిక షేరూను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జంటగా ఆ ఇంట్లోకి రాబోతున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తి కలిగించే విషయం. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే చోట ఉండటం.. అందులోనూ 100 రోజుల పాటు అందరి మధ్య కలిసి ఉండటం అనేది చిన్న విషయం కాదు. పైగా వాళ్లు చేసే ప్రతి చిన్న పని కూడా కెమెరాకు దొరుకుతుంది. అలాంటి సమయంలో ఈ జంట అక్కడ ఎలా ఉంటారు అనేది మాత్రం నిజంగానే ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. ఇది కూడా ఒక స్ట్రాటజీ. నిజమైన జంటను లోపలికి పంపిస్తే వాళ్ళు చేసే ప్రతి పని బయట చూసేవాళ్ళకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇదే ప్లాన్ తో ఇప్పుడు వరుణ్ సందేశ్ జోడిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు షో నిర్వాహకులు. మరి మొదలవకముందే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన బిగ్ బాస్.. ఒక్కసారి మొదలైన తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో అనేది అందరిలోనూ కనిపిస్తున్న ఆసక్తి.
 

More Related Stories