రాజు గారి 3వ గదిలోకి....చిన్నారి పెళ్లి కూతురు !

ఈమధ్యనే తమన్నా హీరోయిన్ గా యాంకర్-డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వంలో ‘రాజు గారి గది 3’ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాజు గారి గది అంటూ గతంలో తీసిన ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్గా నాగార్జునతో రాజు గారి గది 2 తెరకెక్కించారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కాలేదు కానీ హిట్ గానే నిలిచింది. ఈ నేపధ్యంలో మొన్ననే ఈ సినిమాకు మూడో సీక్వెల్గా తమన్నా ముఖ్యపాత్రలో రాజు గారి గది 3 సినిమాకు రీసెంట్ గా ఓపెనింగ్ కూడా చేశారు. ఈ సినిమాను కూడా గత రెండు సినిమాల లానే ఓంకార్ తన సొంత నిర్మాణంలోనే తెరకెక్కిస్తున్నాడు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ కోసం సెట్లో అడుగుపెట్టిన తమన్నా కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ వలన ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నానని చెప్పి తప్పుకుందని చెబుతున్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన లేకున్నా ఈ సినిమాలో వెంటనే తాప్సీని ఓకే చేసేసారని కూడా ఈ ప్రచారం సాగింది. అంతేకాక ఈ సినిమా ఆఫర్ కాజల్ ని వరించిందని కూడా జరిగిందని చెబుతున్నారు. అయితే ఇక తాజా సమాచారం ప్రకారం, చిన్నారి పెళ్లి కూతురు, ఉయ్యాల జంపాల హీరోయిన్ అవికా గోర్ను ‘రాజు గారి గది-3’ మెయిన్ లీడ్ గా తీసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. తెలుగులో అవికా చేసింది కొన్ని సినిమాలే వాటిలో ఆమెంకి హిట్స్ ఉన్నాయి. అయితే ఆ క్రెడిట్ ఆమెకు దక్కలేదు, ఆఫర్స్ రాక కెరీర్ ఆపేసి చదువు పేరుతో సొంతూరు వెళ్ళిపోయింది. ఇక అలాంటి భామని ఓంకార్ ఒప్పించి మరీ సినిమా చేయిస్తున్నాడని ఈరోజు నుండి ఆమె షూట్ లో పాల్గొంటుందని అంటున్న్నారు.