English   

బిగ్ బాస్ 3 మీద మరో నటి సంచలన వ్యాఖ్యలు

biggboss
2019-07-21 08:50:12

మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ సీజన్ 3 మొదలుకానుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ షో చుట్టూ అనేక వివాదాలు తిరుగుతున్నాయి. ఇటువంటి క్రమంలో మరో నటి ఈ షో మీద సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఈ బిగ్ బాస్ షో పై హీరోయిన్, బీజేపీ నేత మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్‌ ని ఎంపిక చేసే ప్రాసెస్ వేసే ప్రశ్నలు చాలా అసభ్యకరంగా ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ముఖ్యంగా హౌస్ లోకి వెళ్ళటానికి ఇంటర్వ్యూకు వెళ్లిన సమయంలో తనని షో నిర్వాహకులు వేసిన ప్రశ్నలు గురించి మాధవి లత చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా షో నిర్వాహకులు ఇంటర్వ్యూలో హౌస్ లో ఎవరితోనైనా లవ్ లో పడితే ఏమి చేస్తారని ప్రశ్నించినట్లు మాధవి లత చెప్పుకొచ్చింది. అయితే అసలు హౌస్‌లోకి వెళ్లక ముందే అలా ఎలా చెబుతానని తాను సమాధానం ఇచ్చినట్లు మాధవీలత అన్నారు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే ఈ షోలో పాల్గొనే వాళ్లు ఆలోచించాలని ఆమె పేర్కొంది. ఇతరులతో కలిసి పడుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామమని అని, స్త్రీపురుషులిద్దరికీ వేర్వేరు బెడ్రూంలు పెట్టినప్పటికీ, కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే కొద్దీ, వారి ఒకే రూంలో పడుకునే పరిస్ధితి వస్తుందని మాధవీలత చెప్పుకొచ్చింది. అంతేకాక బాత్రూంలో కమోడ్ కనిపించే వరకూ కెమెరా ఏర్పాటు చేస్తారని ఇది చాలా అభ్యంతరకరమని  మాధవీలత పేర్కొన్నారు. అంతేకాక కంటెస్టెంట్స్ మధ్య నిర్వహించే గేమ్స్ మహిళా కంటెస్టెంట్స్‌ను తాకేలా ఉండడం వలన చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని ఆమె వ్యాఖ్యానించింది.

More Related Stories