English   

బిగ్ బాస్ 3 కోసం మా టీవీ మాస్ట‌ర్ ప్లాన్.. న్యూస్ ఛానెల్స్ కు షాక్.. 

Bigg Boss 3
2019-07-29 16:31:51

అత్త సొమ్ము అల్లుడు దానం అన్న‌ట్లు.. స్టార్ మా కోట్లు పెట్టి బిగ్ బాస్ రియాలిటీ షో న‌డుపుతుంటే దాని క్రేజ్ అంతా న్యూస్ ఛానెల్స్ వాడేసుకుంటున్నారు. ఆ ఇంట్లోంచి బ‌య‌టికి వ‌చ్చిన కంటెస్టెంట్స్ కు స‌ప‌రేట్ గా సూట్ ఇచ్చి మ‌రీ ఓ రోజు మొత్తం న్యూస్ ఛానెల్స్ త‌మ చుట్టూ తిప్పుకుంటున్నాయి. ఈ స్టూడియోల్లోనే వాళ్ల స‌గం జీవితం అయిపోతుంది. ఎలిమినేష‌న్ త‌ర్వాత వాళ్ల ఇంటి కంటే కూడా న్యూస్ ఛానెల్స్ స్టూడియోల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తుంటారు కంటెస్టెంట్స్. ఇలాంటి ఆటలు ఇక చెల్ల‌వు. న్యూస్ ఛానెల్స్ కు దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చింది స్టార్ మా యాజ‌మాన్యం. తొలి రెండు సీజన్స్ విష‌యంలో జ‌రిగిన ర‌చ్చ చూసిన మా.. ఇప్పుడు త‌మ‌కంటూ ప్ర‌త్యేకంగా ఓ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకుంది. త‌నీష్ ను హోస్టుగా పెట్టుకుని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో ఓ కార్య‌క్ర‌మం మొద‌లుపెడుతున్నారు. ఆ ఇంట్లో వాళ్ల అనుభ‌వాలు.. వివాదాల గురించి అక్క‌డ అడిగి తెలుసుకుంటున్నార‌న్న‌మాట‌. ఈ దిశ‌గా ముందే ఒప్పందం కూడా చేసుకున్నారు. బ‌య‌టి ఛానెల్స్ కు వెళ్ల‌కుండా ఎలిమినేట్ అయిన వాళ్లు ముందు త‌మ షోకే రావాల‌ని వాళ్లు పెట్టిన కండీష‌న్. అంటే ఇప్పుడు హేమ కూడా న్యూస్ స్టూడియోల‌లో క‌నిపించ‌దు.. కేవ‌లం మా టీవీలోనే ఉండ‌బోతుంద‌న్న‌మాట‌. మొత్తానికి మా టీవీ ఇచ్చిన షాక్ ఇప్పుడు న్యూస్ ఛానెల్స్ కు నిద్ర కూడా రానివ్వ‌డం లేదు.

More Related Stories