English   

బిగ్ బాస్ 3 : తమన్నా ఎంట్రీతోనే పాలిటిక్స్....ఎనిమిది మంది నామినేషన్

 Tamanna Simhadri
2019-07-30 09:09:17

బిగ్ బాస్ సీజన్ 3లో ఇప్పైకే గొడవలు మొదలయినా, అవి సిల్లీగా ఉండడంతో అంతగా ఏమీ అనిపించలేదు. కానీ   అసలు ఆట ఇప్పుడే మొదలైనట్టు అనిపిస్తోంది. మొదటి వారం ఎలిమినేషన్‌లో భాగంగా హేమ బిగ్ బాస్ హౌస్‌ నుండి వెళ్ళిపోగా వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి రాకతో హౌస్‌లో కొత్త రచ్చ రేపింది. అయితే ముందుగా ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి రావడం చూసి ఆశ్చర్యపోయిన కంటెస్టెంట్స్ ఏమీ మాట్లాడలేక పోయారు. అయితే వచ్చీ రావడంతోటే గేమ్ మొదలు పెట్టిన తమన్నా బాబా భాస్కర్, జాఫర్ ల టీంతో కలిసి ఉంటానని చెప్పింది. అంతే కాక ఎప్పుడో జరిగిన మహేష్ విట్టా వరుణ్, వితికాల గొడవ గురించి ప్రస్తావించి అసలు మహేష్ వాళ్లకు సారీ చెప్పాల్సిన అవసరం లేదని, వరుణ్ సందేశ్ ని ఆడుకుందామనే హౌస్ లోపలి వచ్చానని  బాబా భాస్కర్‌, జాఫర్‌, మహేష్‌, అలీ రెజా, శ్రీముఖిలతో చెప్పుకొచ్చింది తమన్నా. ఇక ఈవారం ఎలిమినేషన్స్‌లో భాగంగా నామినేషన్స్ నిర్వహించారు బిగ్ బాస్. ఒక్కో కంటెస్టెంట్‌ను కన్‌ఫిషన్ రూంకి పిలిచి.. ఇద్దరి పేర్లను నామినేట్ చేయాల్సిందిగా కోరారు. అయితే ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నాను నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ ఆదేశించారు. నామినేషన్ ప్రారంభమైన తరువాత ఎవరితోనూ చర్చించకూడదనే నిబంధనను పాటించని కారణంగా వరుణ్ సందేశ్ భార్య వితికని. నామినేషన్ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించారు బిగ్ బాస్. కాగా ఈ నామినేషన్ ప్రక్రియలో మళ్ళీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు బాబా భాస్కర్. బిగ్ బాస్ ఇద్దర్ని నామినేట్ చేయమంటే హౌస్‌కి వచ్చి వారమే అయ్యిందిని ఇద్దర్ని నామినేట్ చేయమంటే నేను చేయలేనని కావాలంటే నన్ను నామినేట్ చేసుకోండని బిగ్ బాస్ కి చెప్పారు బాబా భాస్కర్. చిఅవ్రికి ఆయన ఒప్పుకుని వితికా, వరుణ్ లను నామినేట్ చేశారు. అలా ప్రతి సభ్యుడు ఇద్దర్ని నామినేట్ చేయగా ఫైనల్ గా ఈ నామినేషన్ ప్రక్రియలో శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్‌లు ఈవారం ఎలిమినేషన్‌ కి నామినేట్ అయ్యారు. ఒకేసారి ఎనిమిది మంది నామినేట్ కావడం విశేషం ఈ వారాల్ స్పెషల్ గా ఎక్కువ మంది శ్రీముఖి, హిమజలను నామినేట్ చేశారు.  

More Related Stories