English   

బిగ్ బాస్ 3 సూపర్ హిట్.. పండగ చేసుకుంటున్న నాగార్జున..

 Bigg Boss nagarjuna
2019-08-01 18:37:03

బిగ్ బాస్ 3 మొదలు కాకముందు చాలా వివాదాలు రేగాయి. ఉస్మానియా విద్యార్థులు అయితే ఏకంగా నాగ్ ఇంటిని కూడా ముట్టడించారు. అంతగా రచ్చ చేసారు వాళ్లు. దానికి ముందే పోలీస్ స్టేషన్ కేసులు.. శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా వ్యాఖ్యలు ఇవన్నీ షోపై చాలా ఆసక్తి పుట్టించాయి. ఈ సారి చూడని వాళ్లు కూడా చూసేలా చేసాయి ఈ వివాదాలు. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చాయి ఈ షోకు. అన్నీ దాటుకుని వచ్చిన బిగ్ బాస్ ఇప్పుడు సంచలనాలు క్రియేట్ చేస్తుంది. తొలివారం ముగిసేసరికి రేటింగ్స్ చూస్తే అందరి మైండ్స్ బ్లాంక్ అయిపోతున్నాయి. ఇప్పటి వరకు కనివినీ ఎరుగని రీతిలో ఈ షో రప్ఫాడిస్తుంది. 17.6 రేటింగ్స్ సాధించి బిగ్ బాస్ హిస్టరీలో హైయ్యస్ట్ టిఆర్పీ సాధించింది. నాగార్జున హోస్టింగ్ కు తోడు.. వచ్చిన కంటెస్టెంట్స్.. ఇస్తున్న టాస్కులు అన్నీ దీనిపై ఆసక్తి పెంచేస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే నాగార్జున పర్సనల్ గా ఈ షోను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. పండు అంటూ చేతికి చిన్న కోతి బొమ్మ పట్టుకుని వచ్చి తనదైన శైలిలో శని, ఆదివారాలు రప్ఫాడిస్తున్నాడు మన్మథుడు. ఇప్పటి వరకు ఇ:కా సినిమా వాళ్లెవరూ ఈ షోకు రాలేదు.. వచ్చిన తర్వాత రేటింగ్స్ మరింత బ్రహ్మాండంగా ఉంటాయని ఆశిస్తున్నారు స్టార్ మా యాజమాన్యం. ప్రస్తుతం తమ ఆనందాన్ని స్టోరీ చేసి ట్వీట్ చేసారు వాళ్లు. మరి రాబోయే రోజుల్లో ఈ షో ఇంకెంత మజా ఇవ్వనుందో..?

More Related Stories