English   

ఎవరు కలెక్షన్స్.. హిట్ కావాలంటే ఇంకా 3 కోట్లు రావాల్సిందే..

evaru
2019-08-19 21:28:03

అడవి శేష్ హీరోగా నటించిన సినిమా ఎవరు. గత వారం విడుదలైన ఈ సినిమాకు తొలి రోజే సూపర్ హిట్ టాక్ వచ్చింది. మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనా ప్రతినాయక పాత్రలో నటించడం విశేషం. నూతన దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కించిన ఎవరు సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలున్నాయి. దానికి తోడు ప్రీమియర్ షోస్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పటి వరకు నాలుగు రోజుల్లో 7 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల 30 లక్షల బిజినెస్ చేసింది ఎవరు. అందులో అత్యధికంగా నైజం 6.50 కోట్లకు అమ్మారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయి హిట్ అనిపించుకోవడం ఖాయం అయిపోయింది. నైజాంలో ఇప్పటికే 5 కోట్ల 30 లక్షల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇంకా మంచి వసూళ్లు వస్తుండటంతో బయ్యర్లు ధైర్యంగా కనిపిస్తున్నారు. మరోవైపు దీనికి పోటీగా విడుదలైన రణరంగం సినిమా ఫ్లాప్ కావడం కూడా ఎవరుకు కలిసొచ్చింది.

ఈవారం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర రెండో వారం కూడా కచ్చితంగా ఎవరు ప్రభావం చూపించడం ఖాయం. ప్రపంచ వ్యాప్తంగా మరో 3 కోట్లు తీసుకొస్తే ఈ సినిమా హిట్ జాబితాలో చేరిపోతుంది. ఇప్పటికే క్షణం, గూడచారి సినిమాలతో సందడి లేకుండా వచ్చి సంచలన విజయాలు అందుకున్నాడు అడివి శేష్. ముచ్చటగా మూడోసారి కూడా ఇదే చేశాడు ఈయన. దాంతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరుచుకున్నాడు అడివి శేష్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా స్క్రీన్ ప్లే ఆధారంగా సాగే సినిమాలు చేస్తూ హాలీవుడ్ స్టైల్ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు అడివి శేష్. అలాంటి కథతోనే వరుస విజయాలను అందుకుంటున్నాడు ఈ కుర్రహీరో. ఇప్పుడు ఎవరు కూడా ఇదే మ్యాజిక్ చేసింది.

More Related Stories