English   

3 మంకీస్ టీజర్ విడుదల.. సుడిగాలి సుధీర్ టీం రచ్చ.. 

 3 monkeys
2019-09-28 12:51:13

జబర్దస్త్ కామెడీ షోతో ప్రేక్షకుల మనసు దోచుకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్. బుల్లితెరపై ఈయనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్మాల్ స్క్రీన్ లో ఇప్పుడున్న నటుల్లో సుడిగాలి సుధీర్ ఫాలోయింగ్ ఎక్కువ. పైగా మనోడు ఎప్పటికప్పుడు ఎఫైర్స్ తో కూడా వార్తల్లో ఉంటాడు. ఇప్పుడు ఈయన హీరోగా మారిపోయాడు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు ఇప్పుడు 3 మంకీస్ అనే మరో సినిమా చేస్తున్నాడు. ఇందులో సుడిగాలి సుధీర్ టీం నటిస్తున్నారు. అంటే ఆటో రంప్రసాద్, గెటప్ శ్రీను అన్నమాట. ఈ ముగ్గురు ఇప్పుడు మూడు కోతలుగా మారిపోయారు. ఈ చిత్ర టీజర్ విడుదలైందిప్పుడు. పూర్తిగా క్రేజీ ఆలోచనలతో ఉండే ముగ్గురు యవకులు కలిస్తే ఎలా ఉంటుదనేది ఈ చిత్ర కథ. అనిల్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా విడుదలైన టీజర్ కూడా క్రేజీగా ఉంది. కచ్చితంగా ఈ సినిమాతో విజయం అందుకుంటామని ధీమాగా చెబుతున్నారు ఈ ముగ్గురు. మొన్న ఫస్ట్ లుక్ లాంఛ్ అప్పుడు కూడా సుడిగాలి సుధీర్ టీం గురించి తెగ పొగిడేసాడు. జబర్దస్త్ షో నుంచి వచ్చిన అద్భుతమైన కమెడియన్స్ లో ఈ ముగ్గురు కూడా ఉన్నారంటున్నాడు ఈయన. కచ్చితంగా ఈ సినిమాతో వాళ్లు విజయం అందుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు మెగా బ్రదర్. మరి జబర్దస్త్ కమెడియన్స్ చేసే కోతి పనులు ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతాయో చూడాలి.

More Related Stories