English   

రాజు గారి గది 3 ప్రివ్యూ.. ఓంకార్ అన్నయ్య హిట్ కొడతాడా..

 Raju Gari Gadhi 3
2019-10-17 16:50:40

రాజు గారి గది అనేది ఒక సినిమా కాదు.. బ్రాండ్ గా మార్చేసాడు ఓంకార్. తొలి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రాజు గారి గది 2 తీశాడు. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. నాగార్జున, సమంత లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్నా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో రాజుగారిగది 2 నిరాశపరిచింది. సందేశం అంటూ వినోదం దూరం చేయడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఇప్పుడు రాజుగారిగది 3 అంటూ వస్తున్నాడు ఓంకార్. అక్టోబర్ 18న ఈ సినిమా విడుదలవుతుంది. ముందు నుంచి ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. తమన్నాతో సినిమా ఓపెన్ చేసి చివరికి చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ తో సినిమాను పూర్తి చేశాడు ఓంకార్ అన్నయ్య. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పర్లేదు అని రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎప్పటిలాగే మళ్ళీ అదే దయ్యం కథతో వస్తున్నాడు ఓంకార్. రెండో భాగం ప్రేక్షకులు పెద్దగా ఆడలేదు.. దానికితోడు నవ్వించలేదు కూడా.. దాంతో మూడో భాగంతో కచ్చితంగా కడుపులు చెక్కలయ్యేలా నవ్విస్తాను అంటున్నాడు ఈ దర్శకుడు. దానికితోడు ఈ సినిమాలో సందేశాలు ఉండవని కేవలం కామెడీ మాత్రమే ఉంటుంది అంటున్నాడు. ప్రేక్షకులను నవ్వించడం.. నవ్వు మొహాలతో ఇంటికి పంపించడం మాత్రమే తమ సందేశం అంటున్నాడు. ఇందులో కొన్ని సన్నివేశాలు గుర్తుకువచ్చినప్పుడల్లా నవ్విస్తాయి అంటూ మాటిస్తున్నాడు ఓంకార్. మరి ఈయన తెరకెక్కించిన రాజు గారి గది 3 ఎలా ఉండబోతుందో చూడాలి.

More Related Stories