English   

దబంగ్ 3 ట్రైలర్ టాక్.. సుదీప్‌పై పగబట్టిన సల్మాన్ ఖాన్..

salman
2019-10-23 21:15:59

సెప్టెంబ‌ర్ 10.. 2010.. అంటే దాదాపు 9 ఏళ్ల కింద బాలీవుడ్ లో ఓ కుదుపు వ‌చ్చింది. ఆ సంచ‌ల‌నం పేరు ద‌బంగ్. స‌ల్మాన్ ఖాన్ అప్ప‌టికి పెద్ద విజ‌యాల్లో ఏం లేడు. వ‌ర‌స ఫ్లాపుల నుంచి త‌ప్పించుకుని వాంటెడ్ సినిమాతో ఓదార్పు విజ‌యం అందుకున్నాడు అంతే. మ‌ళ్లీ ఆ త‌ర్వాత వీర్ ఫ్లాప్ తో మ‌నోడికి చుక్క‌లు క‌నిపిస్తున్న టైమ్ అది. అలాంటి టైమ్ లో వ‌చ్చింది ద‌బంగ్. అభిన‌వ్ క‌శ్య‌ప్ అనే కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చి.. ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు స‌ల్మాన్ ఖాన్. తాను ఒప్పుకునేట‌ప్పుడు తెలియ‌దు ఓ చ‌రిత్ర‌కు సైన్ చేస్తున్నాన‌ని. ఎందుకంటే ద‌బంగ్ విడుద‌లైన త‌ర్వాత బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూకుడు మామూలుగా లేదు. వాంటెడ్ తో మూత‌బ‌డిన చాలా సింగిల్ స్క్రీన్స్ ఓపెన్ అయితే.. ద‌బంగ్ త‌ర్వాత మ‌ళ్లీ వాటికి క‌ళ వ‌చ్చింది. చుల్ బుల్ పాండేగా స‌ల్మాన్ సంచ‌ల‌న న‌ట‌న రికార్డుల‌ను తిర‌గ‌రాసింది.

ఇదే సినిమా తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌న్నెండేళ్ల ఆక‌లిని తీర్చింది. గ‌బ్బ‌ర్ సింగ్ గా ఇక్క‌డ కూడా రికార్డులు సృష్టించింది దబంగ్. బాలీవుడ్ లో ఇదే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సోనాక్షి సిన్హా. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా మూడో భాగం వస్తుంది. దాని పేరు దబంగ్ 3. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైందిప్పుడు. తొలి రెండు భాగాల్లో కామెడీ యాక్షన్ చూపించిన సల్మాన్.. ద‌బంగ్ 3లో కామెడీ యాక్షన్ తో పాటు రివేంజ్ చూపిస్తున్నాడు. అసలు చుల్ బుల్ పాండే ఎక్కడ్నుంచి వచ్చాడనేది ఈ చిత్ర కథ. ట్రైలర్ లో అన్ని యాంగిల్స్ చూపించాడు సల్మాన్ ఖాన్. ప్రభుదేవా దర్శకుడు. ఇప్ప‌టికే ఐదేళ్ల కింద వ‌చ్చిన ద‌బంగ్ 2 కూడా విజ‌యం సాధించింది. ఇప్పుడు మూడో భాగంపై ఆసక్తి పెరిగిపోయింది. ఇందులో సుదీప్ విలన్ గా నటిస్తుండటం విశేషం. నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు కండల వీరుడు. డిసెంబర్ 20న విడుదల కానుంది ఈ చిత్రం.

 

More Related Stories