English   

బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్.. నిజమా లేదంటే స్ట్రాటజీనా..

Big Boss Winner.jpg
2019-11-03 14:24:51

బిగ్ బాస్ మూడో సీజన్ సాంతం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనే విషయంపై ముందు నుంచే లీకులు వచ్చాయి. ప్రతీ వారం కూడా వచ్చినట్లుగానే బయటికి వెళ్లడం జరిగింది. అయితే ఒక్క వారం మాత్రం వితికా వెళ్తుందని చెప్పి.. మహేష్ విట్టను పంపించేసారు. ఆ ఒక్క వారం మినహా ప్రతీవారం కూడా వచ్చిన లీకులు అన్నీనిజమే అయ్యాయి.

ఇక ఇప్పుడు విన్నర్ గా శ్రీముఖి నిలుస్తుందని ముందు నుంచి వస్తున్నా కూడా చివరికి రాహుల్ అయ్యాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని గంటల నుంచి నానా హంగామా నడుస్తుంది. ఇది చూసి ఆయన ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. కానీ ఇది నిజంగానే నిజమా.. లేదంటే ఏదైనా స్ట్రాటజీనా అనే వాదన కూడా ఉంది.

శ్రీముఖి అంటూ అంతా ఫిక్సైపోయిన తరుణంలో రాహుల్ పేరు తెరపైకి రావడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అయితే ఇది కూడా బిగ్ బాస్ ఆడుతున్న ఆటేమో అనుకుంటున్నారు ఆడియన్స్. కానీ ఇందులో నిజం కూడా లేకపోలేదు.. ఇప్పటి వరకు వచ్చిన లీకులు నిజమే అయినపుడు ఇది కూడా నిజమే అయ్యుంటుందంటున్నారు. ఇప్పటికే రాహుల్ ఇంటి సభ్యులు కూడా పండగ చేసుకుంటున్నారు. శ్రీముఖికి ఎంత సపోర్ట్ చేసినా కూడా విన్నర్ అయ్యేలా మాత్రం ఓట్లు పడలేదు.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విన్నర్ టైటిల్ తీసుకోబోతున్నాడు రాహుల్. మరి చూడాలిక.. సోషల్ మీడియాలో జరుగుతున్నది నిజమైన ప్రచారమా లేదంటే గేమ్ అనేది కొన్ని గంటల్లోనే తేలనుంది.

More Related Stories