English   

సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 ఫస్ట్ రివ్యూ.. ప్రభుదేవా మ్యాజిక్ షో..

Danangg3 First Review.jpg
2019-12-20 07:49:26

సెప్టెంబ‌ర్ 10.. 2010.. అంటే దాదాపు 9 ఏళ్ల కింద బాలీవుడ్ లో ఓ కుదుపు వ‌చ్చింది. ఆ సంచ‌ల‌నం పేరు ద‌బంగ్. స‌ల్మాన్ ఖాన్ అప్ప‌టికి పెద్ద విజ‌యాల్లో ఏం లేడు. వ‌ర‌స ఫ్లాపుల నుంచి త‌ప్పించుకుని వాంటెడ్ సినిమాతో ఓదార్పు విజ‌యం అందుకున్నాడు అంతే. మ‌ళ్లీ ఆ త‌ర్వాత వీర్ ఫ్లాప్ తో మ‌నోడికి చుక్క‌లు క‌నిపిస్తున్న టైమ్ అది. అలాంటి టైమ్ లో వ‌చ్చింది ద‌బంగ్. అభిన‌వ్ క‌శ్య‌ప్ అనే కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చి.. ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు స‌ల్మాన్ ఖాన్. తాను ఒప్పుకునేట‌ప్పుడు తెలియ‌దు ఓ చ‌రిత్ర‌కు సైన్ చేస్తున్నాన‌ని. ఎందుకంటే ద‌బంగ్ విడుద‌లైన త‌ర్వాత బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూకుడు మామూలుగా లేదు.

వాంటెడ్ తో మూత‌బ‌డిన చాలా సింగిల్ స్క్రీన్స్ ఓపెన్ అయితే.. ద‌బంగ్ త‌ర్వాత మ‌ళ్లీ వాటికి క‌ళ వ‌చ్చింది. చుల్ బుల్ పాండేగా స‌ల్మాన్ సంచ‌ల‌న న‌ట‌న రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఇదే సినిమా తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌న్నెండేళ్ల ఆక‌లిని తీర్చింది. గ‌బ్బ‌ర్ సింగ్ గా ఇక్క‌డ కూడా రికార్డులు సృష్టించింది దబంగ్. బాలీవుడ్ లో ఇదే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సోనాక్షి సిన్హా. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా మూడో భాగం వచ్చింది. దాని పేరు దబంగ్ 3. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైందిప్పుడు. తొలి రెండు భాగాల్లో కామెడీ యాక్షన్ చూపించిన సల్మాన్.. ద‌బంగ్ 3లో కామెడీ యాక్షన్ తో పాటు రివేంజ్ చూపించాడు. అసలు చుల్ బుల్ పాండే ఎక్కడ్నుంచి వచ్చాడనేది ఈ చిత్ర కథ.

చాలా రోజుల తర్వాత ప్రభుదేవా కూడా ఒక పక్క మాస్ మసాలా సినిమాని తెరకెక్కించాడు. ప్రీమియర్ షోస్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే  సల్మాన్ ఖాన్ మరోసారి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్ప‌టికే ఐదేళ్ల కింద వ‌చ్చిన ద‌బంగ్ 2 కూడా విజ‌యం సాధించింది. ఇప్పుడు మూడో భాగం కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. సుదీప్ విలన్ గా నటించడం విశేషం. నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ ను హీరోయిన్ గా పరిచయం చేసాడు కండల వీరుడు.

More Related Stories