సరిలేరు నీకెవ్వరు 3 డేస్ కలెక్షన్స్..మూడో రోజు తగ్గినా

అపజయమే ఎరుగని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ బాబు కెరీర్ లోనే మొదటి సారిగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా దేశమంతా అత్యధిక లొకేషన్స్ లో విడుదల అయింది. ఈ మధ్య క్లాస్ సినిమాలే చేస్తూ వస్తున్న మహేష్ ఈ సినిమాతో మాస్, కామెడీ, యాక్షన్లను ట్రై చేశాడు.
లాంగ్ గ్యాప్ తరువాత మహేష్ నుంచి ఓ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ రావటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అనిల్ సుంకర్, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మించిన ఈ సినిమాతో సీనియర్ నటి విజయశాంతి సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అన్ని విషయాల్లో సత్తా చాటింది. తొలి రోజు ఈ సినిమా ఏకంగా 46.77 కోట్ల షేర్ సాధించినట్టు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. అంటే దాదాపు 85 కోట్ల వరకు గ్రాస్ సాధించి ఉంటుందని అంచనా.
సంక్రాంతి బరిలో ముందుగా రావటంతో పాటు సినిమాకి ఉన్న క్రేజ్ సినిమా మీదున్న అంచనాలు సంక్రాంతి సీజన్ అన్నీ కలిసి వచ్చాయి. ఇక తొలి రోజు 46 కోట్లకు పైగా షేర్ సాధించిన సరిలేరు నీకెవ్వరు రెండో రోజు బన్నీ సినిమా పోటీ వలన కేవలం 14 కోట్ల షేర్ మాత్రమే సాధించగలిగింది. ఇక మూడో రోజు 9 కోట్ల మార్క్‌ను కూడా అందుకోలేదని అంటున్నారు. అలా ఈ సినిమా మొత్తం మూడు రోజుల్లో 69 కోట్ల షేర్ సాధించిందని అంటున్నారు. ఇంకా పండుగ్ సెలవలు ఆదివారం దాకా ఉండడంతో ఈ పండుగ రోజుల్లో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.