English   

ఎఫ్‌ 3 మీద దిల్ రాజు క్లారిటీ

Dil Raju
2020-02-05 13:51:31

గతేడాది సంక్రాంతి అల్లుళ్లుగా ‘F2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్, వరుణ్ తేజ్‌లు ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఇక ‘F2’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘F3’ చిత్రాన్ని సీక్వెల్ తీయబోతున్నట్టు అప్పట్లోనే ప్రకటించారు అనిల్ రావిపూడి. ఇక మొన్న మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొట్టిన ఆయన ఇప్పుడు ఈ సినిమా మీద ద్రుష్టి పెట్టాడు. అయితే ఈ సీక్వెల్లో ముగ్గురు కథానాయకులు ఉండబోతున్నారనే విషయం తెలిసిందే. 

వెంకీ, వరుణ్‌ లతోపాటు మరో హీరోని యాడ్ చేయబోతున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ మూడో నటుడిగా రవితేజ నటిస్తారని ప్రచారం జరిగినా అందులో స్పష్టత రాలేదు. కానీ దిల్‌రాజు నిర్మించిన ‘జాను’ సినిమా రిలీజ్ పుణ్యమా అని ఎఫ్ 3 మీద క్లారిటీ వచ్చింది. ఆ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఎఫ్3 వచ్చే సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే మూడో హీరో రవితేజనేనా ? మరొకరా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 'ఎఫ్-2' అంటే 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' అయితే.. 'ఎఫ్-3' అంటే 'ఫన్, ఫ్రస్టేషన్ అండ్ మోర్ ఫన్' అని చెబుతున్నారు.

More Related Stories