English   

వైయస్ జగన్ 3 రాజధానుల అనే విషయంపై షకీలా సెటైర్..

Shakeela
2020-02-05 14:09:41

షకీలా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన పేరు ఇది. ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేసుకుంటూ తనదైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరం అయిన ఈమె అప్పుడప్పుడూ రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంది. ఇలాంటి సమయంలో జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయంపై షకీలా సంచలన సెటైర్లు వేసింది. 

ఉన్నట్టుండి ఈమె రాజకీయాల వైపు ఎందుకు మాట్లాడుతుంది. అంత అవసరం ఆమెకు ఏం వచ్చింది.. ఆమె తెలుగుదేశం పార్టీ కాదు కదా.. అలాగని బీజేపీలో కూడా లేదు.. అలాంటప్పుడు ఎందుకు అనాల్సి వచ్చింది.. ఇలా చాలా అనుమానాలు వస్తున్నాయి కదా.. అయితే దీని వెనుక కథ ఒకటి ఉంది. ఈమె తన సినిమాల్లో జగన్ ప్రస్తావన తీసుకు వచ్చింది. చాలా రోజుల తరువాత షకీలా ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తుంది. ఆ సినిమా టైటిల్ 'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం'. కేవలం ఆమె పేరుకు ఉన్న క్రేజ్ వాడుకోవడానికి దర్శకనిర్మాతలు ఈ టైటిల్ పెట్టారు. 

తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలయింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై  తన మార్కు సెటైర్లు వేసింది షకీలా. ఈ టీజర్ లో షకీలా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటుంది. అందులో ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అనే వార్త ఉంటుంది. అది చదవగానే దాని గురించి తన అసిస్టెంట్ ని అడుగుతుంది. అవును మేడమ్.. జగనన్న మూడు రాజధానులు చేసేశాడు అని చెబుతాడు. దీనితో షకీలా 'ఒక్క స్టేట్ కి మూడు రాజధానులా?.. పోను పోనూ ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు అయినా ఆశ్చర్యం అవసరం లేదు అంటూ షకీలా తనదైన శైలిలో సెటైర్ వేస్తుంది. షకీలా మూడు రాజధానుల గురించి చెప్పిన డైలాగ్ తో ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలో సినిమా విడుదల కానుంది. సినిమాపై ఎలాగోలా ఆసక్తి పెంచేయాలని ఇలా జగన్ డైలాగులు వాడేసుకున్నారు అంటూ కొందరు ఈ సినిమాపై సెటైర్లు వేస్తున్నారు.

More Related Stories