3 ఇయర్స్ తర్వాత రానా సినిమాకు మోక్షం

టాలీవుడ్ వండర్ బాహుబలి సినిమా తర్వాత రానా వరుసపెట్టి సినిమాలు ఒప్పుకున్నాడు. అయితే వాటిలో కొన్ని సినిమాలు రిలీజ్ అయినా.. కొన్ని మాత్రం ఏవో కారణాల వల్ల ఆగిపోయాయి. అలాంటి కోవాకు చెందిన ఒక సినిమా ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో 'హథీ మేరే సాథి' అనే సినిమాలో రానా హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా స్టార్ట్ అయి దాదాపు 3 ఇయర్స్ అయింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు రానా. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. సారీ ఫర్ ది డిలే.. సేవ్ ది ఫారెస్ట్ అంటూ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు రానా. తెలుగులో 'అరణ్యగా', తమిళ్లో 'కాదన్ గా', హిందీలో 'హాథీ మేరే సాథి' టైటిల్స్ తో ఈ సినిమా తెరెక్కెక్కుతోంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ లో రానా చాలా డిఫరెంట్ లుక్ లో.. రౌద్రంగా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో జోయా హుస్సేన్, శ్రియా పిల్గావుంకర్, పుల్కిత్ సామ్రాట్, విష్ణు విశాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎక్కు భాగాన్ని కేరళ అడవుల్లో చిత్రీకరించారు. మానవుల స్వార్ధం కోసం అడవులను నాశనం చేస్తున్నారు.. వాటి వల్ల జంతు మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. ముఖ్యంగా ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని దైర్యంగా ఎదిరించిన వ్యక్తిగా రానా ఇందులో నటిస్తున్నాడు. మరి రానా అరణ్యగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.