English   

ఎఫ్ 3లో మహేష్ కన్ఫాం...షూట్ అప్పటి నుండే 

 Mahesh Babu
2020-02-20 13:39:20

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టి మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం హాలీడే ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మే నుంచి కొత్త సినిమా మొదలు పెట్టనున్నాడు. 

సరిలేరు నీకెవ్వరుతో మంచి విజయం అందించిన దర్శకుడు అనిల్ రావిపూడితో మరోసారి వర్క్ ఎఫ్ 3 కోసం చేయనున్నట్టు చెబుతున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో అనిల్ రావిపూడికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ అనుబంధం రీత్యా ఎఫ్ 3 సీక్వెల్‌లో నటించడానికి ఒప్పుకున్నారట. ఇక అనిల్ రావిపూడికి మహేష్ బాబుకు చెప్పిన నేరేషన్ నచ్చడంతో వెంటనే ఈ చిత్రంలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.  

ఈ  చిత్రాన్ని వంశీ పైడిపల్లి సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.  ఈ సినిమా షూటింగ్ మే నుండి జరగవచ్చని అంటున్నారు. ఇందులో మహేష్ పాత్ర నిడివి 40 నిమషాల వరకు వుంటుందని తెలుస్తోంది. కెరీర్లో ఇప్పటి వరకు అతిథి పాత్రలు మహేష్ బాబు చేసింది లేదు. కానీ ఎఫ్ 3లో మాత్రం అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ వచ్చి మరోసారి ఛాన్స్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.  

More Related Stories