English   

ఎఫ్ 3కి అంతా సిద్ధం.. ఆగస్ట్ లో సెట్స్ పైకి..

venkatesh F
2020-03-24 18:21:24

గతేడాది సంక్రాంతికి వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా ఎఫ్ 2. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఎఫ్2 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని అప్పుడే అనౌన్స్ చేశాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. తాను ఏదైనా సినిమాకు ఫస్టాఫ్ విశాఖపట్నంలో.. సెకండ్ హాఫ్ తన ఇంటి మేడ పైన కూర్చుని రాస్తానని ఈ మధ్య ఒక షోలో చెప్పాడు అనిల్ రావిపూడి. 

ఇక కొన్ని రోజులుగా తన ఊరిలోని సొంత ఇంటిపై తన టీంతో కూర్చుని ఎఫ్2 సీక్వెల్ ఎఫ్ 3 సినిమా కథ పూర్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. ఎవరెవరు నటిస్తున్నారు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లా మారిపోయింది. ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి నోరు విప్పుతాడేమోనని అని అభిమానులు ఆశిస్తున్నారు కానీ ఆయన మాత్రం ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉన్నాడు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ తమ తమ పాత్రల్లో కంటిన్యూ అవుతున్నారు. హీరోయిన్స్ వాళ్లే కనిపిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 

ఎఫ్3 కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటారని.. ఇప్పుడు ఎలా ఉందో దాని కంటే రెండింతలు నవ్వులు ఈ సినిమాలో ఉంటాయని గ్యారెంటీ ఇస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. అన్ని కుదిరితే ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. వచ్చే ఏడాది విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

More Related Stories