కరోనాపై పోరాటానికి రాఘవ లారెన్స్ 3 కోట్ల విరాళం..

రాఘవ లారెన్స్ మరోసారి సంచలనం సృష్టించాడు. సాయం చేయడంలో ఈయన ఎప్పుడు ముందే ఉంటాడు. ఇదే మరోసారి నిరూపించుకున్నాడు. స్టార్ హీరోలను కూడా మించిపోయేలా ఈయన చేసిన సాయం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. కరోనా బాధితులకు తన వంతు సాయంగా 3 కోట్ల విరాళం అందించి అందరికంటే పైన నిలిచాడు లారెన్స్. ఓ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ ఒక్క రూపాయి కూడా తన కోసం వాడుకోకుండా సాయం చేసి తన గొప్పతనం చాటుకున్నాడు లారెన్స్. ఇది తెలిసిన తర్వాత ఆయనపై అభిమానం అందరికీ మరింత ఎక్కువైంది. తాను సంపాదించింది చాలా వరకు ఛారిటీలకే ఇస్తుంటాడు లారెన్స్.
ఓ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అందులో వికలాంగులకు సహాయం చేస్తుంటాడు. అంతేకాదు.. ఇంకా చాలా సాయం చేస్తుంటాడు లారెన్స్. ఇప్పుడు కరోనాపై పోరాటంలో తన వంతు సాయంగా ఏకంగా 3 కోట్లు అందించాడు ఈయన. అందులో తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు.. ప్రధానమంత్రి సహాయనిధికి 50 లక్షలు.. డాన్సర్స్ అసోషియేషన్‌కు 50 లక్షలు.. 50 లక్షలు సినిమా కార్మికులకు.. వికలాంగులకు 25 లక్షలు.. 75 లక్షలు తన సొంతూరి వాళ్ళకు ఇచ్చాడు లారెన్స్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా కోసం తీసుకున్న 3 కోట్ల అడ్వాన్స్ కరోనాపై చేస్తున్న పోరాటానికి విరాళంగా ఇచ్చేసాడు లారెన్స్.