English   

ఎఫ్ 3 మీద అనిల్ క్లారిటీ..హీరో ఎవరో

 Anil ravipudi
2020-04-13 09:11:48

గత ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 తో వచ్చి హిట్టు కొట్టిన అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చేసి అది కూడా సూపర్ హిట్ కొట్టాడు. చేసిన ప్రతి సినిమా హిట్ కావడంతో అపజయమె లేని డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి పేరు పొందాడు. ఇక మహేష్ బాబుతో హిట్ కొట్టిన అనిల్ కి మార్కెట్ కూడా పెరిగింది. దీంతో ఆయన మళ్ళీ చేయబోయే సినిమా మీద క్రేజ్ ఏర్పడింది. అయితే ఆయన తదుపరి సినిమా మీద రకరకాల ప్రకాహరాలు జరిగినా ఆయన మాత్రం ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3నే అని క్లారిటీ ఇచ్చాడు. 

అయితే అందులో నటించే హీరోలు, హీరోయిన్ల విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ‘ఎఫ్ 2’లో నటించిన వారినే కొనసాగిస్తాడా లేదా అనేది తెలియదు. అయితే ఏకంగా సినిమాలో మహేష్ నటిస్తాడని ఒకసారి లేదు రవితేజ ఉంటాడని ఒకసారి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అనిల్ రావిపూడి తాజాగా ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాస్తున్న  కథలో మరో హీరోకి చోటు దక్కేలా కనిపించడం లేదన్న ఆయన ఒకవేళ సెకండాఫ్ లో ఏమైనా ఆ అవకాశం ఉంటే అప్పుడు ఆలోచిస్తామని చెప్పుకొచ్చాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తన సొంత్ ఊళ్ళో తన రచయితల బృందంతో స్ర్కిప్టు పనుల్లో బిజీ ఉన్నారు. ఎఫ్‌ 2 క్యాస్ట్ అంతా ఎఫ్ 3 లోనూ కనిపిస్తారని తేల్చేశారు.

More Related Stories