English   

ఎఫ్3లో స్టార్ హీరో...అనిల్ రావిపూడి క్లారిటీ 

 Anil Ravipudi f3
2020-04-30 13:08:52

గత ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 తో వచ్చి హిట్టు కొట్టిన అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చేసి అది కూడా సూపర్ హిట్ కొట్టాడు. చేసిన ప్రతి సినిమా హిట్ కావడంతో అపజయమె లేని డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి పేరు పొందాడు. ఇక మహేష్ బాబుతో హిట్ కొట్టిన అనిల్ కి మార్కెట్ కూడా పెరిగింది. దీంతో ఆయన మళ్ళీ చేయబోయే సినిమా మీద క్రేజ్ ఏర్పడింది. అయితే ఆయన తదుపరి సినిమా మీద రకరకాల ప్రకాహరాలు జరిగినా ఆయన మాత్రం ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3నే అని క్లారిటీ ఇచ్చాడు.

అయితే అందులో నటించే హీరోలు, హీరోయిన్ల విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే లాక్ డౌన్ కారణంగా తన టీమ్ తో పాటు సొంత ఊరిలో ఇరుక్కు పోయాడు అనిల్ రావిపూడి. అక్కడే తన టీమ్ తో కలిసి ఎఫ్ 3 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇక నిన్న ఎన్టీవీ లైవ్ లోకి వచ్చిన ఆయన ఈ సినిమాలో మరో హీరో ఉంటాడని అది ఎవరనేది సర్ప్రైజ్ అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ మూడో పాత్ర జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే అని ఆయన మాటల బట్టి తెలుస్తుంది. కాబట్టి ఎఫ్ 3లో స్టార్ హీరో క్యామియో రోల్ చేసే అవకాశం కనిపిస్తుంది. 

ఇక 2019 సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్ 2 రెండు పెద్ద సినిమాలను దాటుకుని కూడా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఎఫ్‌ 2 క్యాస్ట్ అంతా ఎఫ్ 3 లోనూ కనిపిస్తారని దానికి అదనంగా మరికొంత మంది నటించనున్నాడు.

More Related Stories