English   

అరియానా హారిక ఎలిమినేట్..టాప్ 3 లో అబ్బాయిలు

Harika Ariyana
2020-12-19 23:33:11

Bigg Boss Telugu 4 Grand Finale ..బిగ్ బాస్ సీజన్ 4కి ఎండ్ కార్డ్ పడబోతుండగా విజేత ఎవరుకాబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది. హాట్ స్టార్ మిస్డ్ కాల్ ద్వారా ప్రేక్షకులు తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్‌కి ఓట్లు వేయగా.. ఈ సీజన్‌లో ఏకంగా 20 కోట్లకు పైగానే ఓట్లు పడినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇది అత్యధిక ఓటింగ్ కాబోతుంది. అయితే ఈ 20 కోట్ల ఓట్లలో ప్రేక్షకులు ఎవరికి బ్రహ్మరథం పట్టారు?? ఎవర్ని విన్నర్‌ని చేయబోతున్నారు?? అనేది ఉత్కంఠగా మారింది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 4  ఫైనల్ కు సంబంధించి శనివారం కొంత భాగం షూటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇద్దరు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ చేశారట. మొదటగా ఐదో స్థానంలో దేత్తడి హారిక ని లవ్ స్టోరీ మూవీ టీమ్ నాగచైతన్య సాయి పల్లవి శేఖర్ కమ్ముల ఎలిమినేట్ చేసి బయటకు పిలిచినట్టు సమాచారం. దేత్తడి హారిక తో లవ్ స్టోరీ టీం కొంతసేపు మాట్లాడినట్టు చెబుతున్నారు.

ఇక నాలుగో స్థానానికి బిగ్ బాస్ టీం షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఓటింగ్ ప్రకారం నాలుగో స్థానంలో అఖిల్ ఉండగా.. అనూహ్యంగా బిగ్ బాస్ టీమ్ అరియానాని ఎలిమినేట్ చేశారట.దర్శకుడు అనిల్ రావిపూడి అరియానాని ఎలిమినేట్ చేసి బయటకు పిలిచినట్టు సమాచారం. ఇప్పుడు టాప్ 3 లో అందరూ అబ్బాయిలు ఉండగా  ఎవర్ని విన్నర్‌ చేయబోతున్నారు?? అనేది ఉత్కంఠగా మారింది.

More Related Stories