ఎఫ్3 మొదలైంది..వెంకటేష్ పైన కీలక సన్నివేశాలు

2020-12-23 15:59:52
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ల తొలికలయికలో అనిల్ రావిపూడి తెరకెక్కిచిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ఎంటర్టైనర్ `ఎఫ్2`. గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఊహించని రీతిలో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఏకంగా వంద కోట్ల క్లబ్లో చేరింది. ఈ మూవీకి సీక్వెల్ గా `ఎఫ్3`ని చేయబోతున్నానంటూ అనిల్ రావిపూడి ప్రకటించారు. లేటెస్ట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో మొదలైంది. ఫస్ట్ డే లొకేషన్ లో వెంకటేష్ పైనే కీలక సీన్లు తీస్తున్నారు. వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కొద్దీ రోజుల తర్వాత జాయిన్ అవుతారట. మరోవైపు, ఈ సినిమాలోని కొన్ని కీలక సీన్ల కోసం ఒక బిగ్ హౌస్ సెట్ ని వెయ్యనున్నారట. ఎఫ్3 మనీ వల్ల కలిగే ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటాయో అనే కాన్సెప్ట్‌తో రూపొందనుంది.